twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజైన 35 ఏళ్లకు తమిళంలోకి డబ్బింగ్

    By Srikanya
    |

    చెన్నై : దాదాపు 35 ఏళ్ల కిందట విడుదలైన సంగీత, దృశ్య భాండాగారం 'శంకరాభరణం'. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించగా ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. కె.విశ్వనాథ్‌, జంధ్యాల కలసి మాటలు రాశారు. తెలుగు కీర్తిపతాకాన్ని నేటికీ రెపరెపలాడిస్తోంది ఈ సినిమా. తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా దేశవిదేశాల్లో సంగీత ప్రియులను ఓలలాడించిన ఈ చిత్రం ప్రస్తుతం డిజిటల్‌ రూపంలో తమిళంలో అనువాదం అవుతోంది.

    ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆ మధ్యన చెన్నైలోని ఆర్‌కేవీ స్టూడియోలో జరిగింది. కార్యక్రమంలో కె.విశ్వనాథ్‌, ఏడిద నాగేశ్వరరావు, గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేస్తున్నారు.

    Now, Sankarabharanam in Tamil

    ఇక ఈ చిత్రాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేసి, 5.1 సౌండ్ సిస్టమ్ హంగులద్దారు. కలర్ కరెక్షన్ చేసి సినిమాను స్కోప్‌లోకి మార్చారు. రీ-రికార్డింగ్ కూడా పాత నోట్స్ తోనే కొత్త ఫార్మాట్ లో అందిస్తున్నారు. ఈ చిత్రరాజాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. దాదాపు ఏడాది కష్టపడి ఈ చిత్రానికి సరికొత్త వన్నెలు అద్దారు.

    కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో నాలుగు జాతీయ అవార్డులు గెల్చుకుంది. గతంలో ‘శంకరాభరణం' తెలుగు వెర్షనే తమిళనాట సిల్వర్ జూబ్లీ ఆడింది. మరి ఈ తమిళ వెర్షన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ డిజిటల్ వెర్షన్‌ని తెలుగులో కూడా విడుదల చేసే యోచనలో ఉన్నారు ఏడిద నాగేశ్వరరావు.

    English summary
    One of the greatest Indian films of all time, Sankarabharanam, directed by K Viswanath, is to be released in Tamil next month. The film, which bagged four National Awards, has music composed by KV Mahadevan and cinematography by Balu Mahendra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X