హాట్ హీరోయిన్ వ్యాఖ్యలపై కోర్టులో పిటిషన్‌

By Srikanya

చెన్నై : తమిళ హీరోయిన్ సోనా,టిష్యూ పేపర్ వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. తాజాగా సోనాకు వ్యతిరేకంగా పురుషుల భద్రతా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదనన్‌ ఎగ్మూర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. సోనా తమిళ పత్రికకు ఇచ్చిన భేటీలో పురుషులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని అందులో ఆరోపించారు. పురుషులను టిష్యూ పేపరుతో పోల్చడం ఆవేదనకు గురి చేసిందన్నారు. ఇందుకు సంబంధించి ఆమె క్షమాపణ చెప్పాలని కోరతూ నగరంలో ఆందోళనలు చేపట్టినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై డిసెంబర్‌ 3న విచారణ జరగనుంది.

'పురుషుల్ని టిష్యూ పేపర్‌లా వాడుకోవాలి.. 'ఆ' అవసరం తీరిన తరువాత చేతులు దులుపుకోవాలి.. వారితో వివాహం పేరుతో శాశ్వత బంధాన్ని పెంచుకోకూడదు'అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సినీనటి సోనాపై తమిళనాడు పురుషుల భద్రతా సంఘం మండిపడింది. సోనా వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించింది. సోనా ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించింది. దీంతో చెన్నయ్‌లోని సోనా ఇంటికి ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భద్రత కల్పించారు.

మహిళా సంఘాలు కూడా సోనా వ్యాఖ్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. ఓ వార పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సోనా తన పెళ్లి ప్రస్తావనపై స్పందిస్తూ 'లైంగిక జీవితంలో పురుషులను టిష్యూ పేపర్‌లాగా వినియోగించుకోవాలం'టూ వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారమే రేగుతోంది.

ఇదిలా వుండగా, వివాదం ముదురుతోందని గ్రహించిన సోనా నింపాదిగా తేరుకుంది. తాను అలా అనలేదని, తాను ఎవరికీ, ఏ పత్రికకూ ఇంటర్వ్యూ ఇవ్వలేదని, తాను అనని మాటలను అన్నట్టుగా చిత్రీకరిస్తూ తనను వివాదంలోకి లాగుతున్నారంటూ సోనా వాపోయింది. ఓ తమిళ పత్రిక ప్రతినిధితో మాట్లాడిన సోనా తనపై రేగుతున్న వివాదంపై పైవిధంగా స్పందించింది. 'పురుషులంటే నాకు ప్రత్యేకమైన గౌరవం వుంది. నా స్నేహితుల్లో 99 శాతం మంది పురుషులే'నంటూ చెప్పుకొచ్చింది. ఎవరో కావాలనే తనను వివాదంలో ఇరికించేందుకే ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నారని వెల్లడించింది. కాగా ఆమె నగర పోలీసు కమిషనర్ జార్జిని కలుసుకొని తనపై వదంతులను పుట్టించే వారిపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X