అనుష్క చిత్రానికి 3 కోట్లు నష్టం
"జేజమ్మ" గా అరుంధతి చిత్రంతో అందరి మన్ననలు పొందిన అనుష్కకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అరుంధతి చిత్రం తమిళంలో ఆశించినంత విజయం సాధించకపోయినప్పటికీ, అనుష్క నటనకి మంచి మార్కులే వచ్చాయి. దీంతో తమిళ నిర్మాతలు కూడా అనుష్క కాల్షీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా వుండగా ప్రతిష్టాత్మకమైన ఎ.వి.యం. స్టుడియోస్ విజయ్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం "వెట్టేకరణ్". బాబు శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క కథానాయికగా నటిస్తున్నారు. కాగా జులై 31న ఎ.వి.యం. స్టుడియోస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ సినిమాకు సంబందించి 3 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











