Jailer: రజినీకాంత్ మూవీనా మజాకా.. ఉద్యోగులకు హాలీడే ప్రకటించిన ఆఫీసులు

ఏజ్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. ఇప్పటికీ అదే స్పీడును కొనసాగిస్తూ ముందుకు సాగుతోన్నారు. అయితే, ఈ మధ్య కాలంలో సరైన విజయాన్ని మాత్రం ఈ సీనియర్ హీరో దక్కించుకోలేదు. దీంతో ఇప్పుడు 'జైలర్' చేశారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రమే 'జైలర్'. పూర్తి స్థాయి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. దీంతో ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయేలా ఉన్నాయని చెప్పాలి.

Offices Announcing holiday for Jailer release in Chennai and Bengaluru

సాధారణంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ హడావిడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఆయన సినిమాలకు ప్రైవేటు కంపెనీలు సెలవులు ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు 'జైలర్' మూవీ విషయంలోనూ అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Offices Announcing holiday for Jailer release in Chennai and Bengaluru

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీ ఆగస్టు 10వ తేదీన విడుదల అవుతోంది. దీన్ని పురస్కరించుకుని బెంగళూరు, చెన్నైలోని కొన్ని ప్రైవేటు కంపెనీలు సెలవు ప్రకటించాయి. రజినీ సినిమాను మొదటి రోజే తమ ఉద్యోగులు చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు కంపెనీలు అధికారికంగా ప్రకటించాయి. ఈ సెలవు ప్రకటనలకు సంబంధించిన కాపీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఇవి చూసిన వాళ్లంతా రజినీ క్రేజ్‌ ఈ రేంజ్‌లో ఉంటుందా అంటూ షాక్ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. రజినీకాంత్ - నెల్సన్ కాంబినేషన్‌లో రూపొందిన 'జైలర్' మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేయగా.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X