twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజ్ డేట్...ట్విట్టర్ లో దర్శకుడు ప్రకటన

    By Srikanya
    |

    చెన్నె : ధనుష్‌, అమైరా దస్తూర్‌, కార్తిక్‌ ముఖ్య తారాగణంతో కె.వి.ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అనేగన్‌'. ఈ చిత్రం పొంగల్‌కు విడుదల కావాల్సిఉండగా 'ఐ', 'ఎన్నై అరిందాల్‌' తదితర భారీ బడ్జెట్‌ చిత్రాల విడుదల సందర్భంగా 'అనేగన్‌' విడుదలను వాయిదా వేశారు. పొంగల్‌కు 'ఐ' విడుదలైన నేపథ్యంలో ఫిబ్రవరి 5న 'ఎన్నై అరిందాల్‌' విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    దీంతో ఫిబ్రవరి 13న 'అనేగన్‌'ను విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు కె.వి.ఆనంద్‌ తన ట్విట్టరులో అధికారికంగా పేర్కొన్నారు.

    Official : Dhanush Anegan Movie Release Date Confirm

    చిత్రంలోని 'టంకామారి' అనే పాట ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తుండగా ఇటీవల విడుదలైన చిత్ర ట్రయలర్లను పది లక్షలకు మించిన ప్రజలు వీక్షించారు. ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే కావడంతో దానికి ముందు రోజు విడుదలయ్యే ఆ చిత్రం ప్రేమికులకు కానుకగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి.

    తెలుగు వెర్షన్ విషయానికి వస్తే...

    రీసెంట్ గా ‘రఘువరన్ బిటెక్' సినిమా తెలుగులో విజయం సాధించడంతో ధనుష్ చాలా సంతోషంగా ఉన్నాడు. 2014లో తెలుగులో హిట్ కొట్టిన అతికొద్ది తమిళ హీరోలలో ధనుష్ ఒకరు. ‘రఘువరన్ బిటెక్' విజయంతో తన తాజా తమిళ సినిమా ‘అనేగన్'ను తెలుగు డబ్బింగ్ చేస్తున్నాడు. ఈ సక్సెస్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. ‘అనేగన్'ను తెలుగులో ‘అనేకుడు' పేరుతో అనువదిస్తున్నారు.

    ధనుష్‌ హీరోగా ఎ.జి.యస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘అనేకుడు'. కల్పాతి.ఎస్‌.అగోరమ్‌ తెలుగులో అందిస్తున్నారు. ‘రంగం' ఫేమ్‌ కె.వి.ఆనంద్‌ దర్శకుడు.

    కల్పాతి ఎస్‌.అగోరమ్‌ మాట్లాడుతూ ‘‘కె.వి.ఆనంద్‌ చక్కగా తెరకెక్కించారు. కార్తీక్‌ కీలక పాత్రలో నటించారు. ముంబై భామ అమీరా డస్టర్‌ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమవుతోంది. హరీష్‌ జైరాజ్‌ మంచి సంగీతాన్నిచ్చారు. ఆరు పాటలున్నాయి. సాహితి, వనమాలి రాసిన పాటలు, కణల్‌ కణ్ణన్‌ ఫైట్లు హైలైట్‌ అవుతాయి. బర్మా, మలేషియా, నార్త్‌ అమెరికాల్లో చిత్రీకరించాం. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది'' అని తెలిపారు.

    ఈ సినిమాకు కెమెరా: ఓం ప్రకాష్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, ఎడిటింగ్‌: ఆంథోని, ఆర్ట్‌: డిఆర్‌కె. కిరణ్‌, కథ, స్క్రీన్‌ప్లే: కె.వి.ఆనంద్‌, శుభ, నిర్మాతలు: కల్పాతి ఎస్‌.అగోరమ్‌, కల్పాతి ఎస్‌.గణేష్‌, కల్పాతి ఎస్‌.సురేష్‌.

    English summary
    Dhanush is already set to release his periodic film 'Anegan'.This film would be the gift for lovers thats why Anegan team plans to release this movie before one day (13th Jan) of Valentines day.Anegan movie is directed by KV Anand.This movie story revolves around some periodic situations.Amyra Datsur playing heroine role in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X