twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశ్వనాధన్ దర్శకత్వంలో "ఓమ్ ఒబామా" చిత్రం

    By Srikanya
    |

    ఒబామా ఇండియా పర్యటన ఎలా ఉన్నా తమిళంలో మాత్రం "ఓమ్ ఒబామా" అనే టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతోంది. జర్నలిస్టు నుంచి ఫిల్మ్ మేకర్ గా మారిన విశ్వనాధన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఒబామా కనపడరు కాని ఆయన కటౌట్స్, పోస్టర్స్,ఆయనపై ఓ పాట ఉంటాయి. ఈ చిత్రం కథ గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేదారపాలయమ్ అనే కుగ్రామం వారు అమెరికా ఎలక్షన్స్ ప్రెసెడెంట్ గా ఒబమా మళ్ళీ గెలుపొందాలని ప్రార్ధన చేస్తూంటారు. దానకి కారణం ఆయనకి ఆర్దిక విధానాల పట్ల ఉన్న అవగాహన, ఆయన ఎకనామిక్ పాలసీలు. వాటికీ ఈ ఊరి వారికీ సంభందం ఏమిటంటే..అక్కడ పెట్టిన ఓ గార్మెంట్ సంస్ధ అమెరికాకు బట్టలు ఎక్సపోర్ట్ చేస్తూంటుంది. అయితే ఆర్దిక మాంధ్యం దెబ్బతో అది మూతపడే స్దితి వస్తుంది. ఈ స్ధితిలో ఆ ఊరివారంతా రోడ్డున పడతారు. అప్పుడు వారికి కనపడే ఏకైక మార్గం ఒబామా. ఆయన గార్మెంట్స్ ఎక్సపోర్ట్ ను ప్రోత్సహిస్తే తమ బ్రతుకులు బాగు పడతాయని ఆశ. అందుకే వారంతా ఓం ఒబామా అని ఓ రేంజిలో ప్రార్ధనలు చేస్తూంటారు.

    డిసెంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంలో రొమాన్స్, రాజకీయాలు, పంచాయితీ ఎలక్షన్స్ వీటిన్నటికీ ముడిపడి ఒబామా అంశం ఉంటుంది. ఇక ఈ కథ అంతా ఓ టీవీ జర్నలిస్టు కోణంలో జరుగుతుంది. కొంత మంది అమెరకన్స్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తాము షూటింగ్ చేస్తున్న ఊరి జనాన్ని కూడా ఆర్టిస్టులుగా ఉపయోగించుకున్నామంటున్నారు. ఇక ఈ చిత్రంలో ఒబామా పొగుడుతూ ఓ పాట ఉర్దూలో ఉంటుంది. ముప్పై ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసారు. ఇక తనకీ ఐడియా జర్నలిస్టుగా పనిచేస్తున్నప్పుడు తిరుపూర్ గార్మెంట్ యూనిట్స్ అన్నీ ఆర్ధిక మాంధ్యం దెబ్బకు కూలిన వైనం తాను స్వయంగా చూసానని, ఎక్కడో జరిగే ఓ మార్పు ఇండియాలోని ఓ మారుమాల పల్లెలో ఎఫెక్ట్ అవటం తనను కదిలించి వేసిందని,అదే ఈ చిత్రానికి ఉసిగొల్పిందని అన్నారు. అలాగే 2008 అమెరికా ఎన్నికల్లో ఒబామా గెలవాలని నిజంగానే తిరుపూర్ ఎక్సపోర్టర్స్ ప్రార్ధనలు చేసారని అన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ పెస్టివల్స్ కు పంపే ఆలోచనలో ఉన్నామన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X