Just In
- 41 min ago
నా పేరు రంగడు వీడి పేరు.. హద్దులు దాటుతోన్న హైపర్ ఆది డబుల్ మీనింగ్
- 1 hr ago
అది కంట్రోల్ చేయడమే నా పేరుకు అర్థం.. ఎద అందాలతో చిచ్చుపెట్టిన ఊర్వశీ
- 2 hrs ago
ఇదెక్కడి వింతరా బాబు.. సుత్తితో కొట్టేసుకుంటోన్న హీరో.. వీడియో వైరల్
- 2 hrs ago
నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ: ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్
Don't Miss!
- Finance
ఆనంద్ మహీంద్ర గిప్ట్: ఆరుగురు టీమిండియా ప్లేయర్లకు కార్లు బహుమానం..
- News
ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు .. ఎస్ఈసీ నిమ్మగడ్డపై విరుచుకుపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం
- Sports
ఏదైనా చేసుకోండి.. మేం మాత్రం అక్కడికి వెళ్లం! బీసీసీఐకి రవిశాస్త్రి హెచ్చరిక!
- Automobiles
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- Lifestyle
సెక్స్ సమయంలో మీరు ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇలాంటి అభిమానులు ఉన్నారంటే.. ఆ స్టార్ హీరోలు సినిమాలు తీయడమే మానేస్తారు, సిగ్గు లేకుండా..
అభిమాని లేనిదే హీరోలు లేరు అనే మాట ప్రతి ఒక్క స్టార్ హీరోకు తెలుసు. అందుకే ప్రేక్షకులను దేవుళ్ళుగా భావిస్తారు. అయితే కొందరు మాత్రం అభిమానులతో ఎంత వరకు ఉండలో అంత వరకే ఉంటారు. అవసరం అయిన సందర్బల్లో స్పందిస్తూ ఉంటారు. అంతే గాని అనవసరంగా వివధాలని క్రియేట్ చేసుకోవద్దని భావిస్తారు. అయితే తమిళ్ ఇండస్ట్రీలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా అభిమానుల కొట్లాటల్లో మాత్రం మార్పు రాలేదు. ఒక ఇద్దరు స్టార్ హీరోల పేర్లు అయితే గట్టిగానే వైరల్ అవుతున్నాయి.

వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు
తమిళ్ ఇండస్ట్రీలో వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరోల సంఖ్య రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. ముఖ్యంగా విజయ్ మార్కెట్ అమాంతంగా పెరిగిపోతోంది. ఇక అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ స్థాయి కూడా డబుల్ అవుతోంది. ఈ ఇద్దరు హీరోల స్వభావాలు దాదాపు ఒకేలా ఉంటాయి. అనవసరంగా కాంట్రవర్సీ చేసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు.

తన వల్ల అభిమాలు బాధపడవద్దని..
ఇక ఫ్యాన్స్ విషయాల్లో విజయ్ కంటే అజిత్ చాలా దూరంగా ఉంటాడు. వాళ్ళవి చాలా సెన్సిటివ్ మైండ్స్ ఉంటాయని ఎలాంటి స్టేట్మెంట్ లు ఇవ్వడు. కనీసం సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ కూడా నిర్వహించడు. ప్రెస్ మీట్స్ ఇంటర్వ్యూలకు దూరంగానే ఉంటాడు. ఏదైనా పొలిటికల్ రూమర్స్ వస్తే వెంటనే క్లారిటీ ఇచ్చేస్తాడు. తన వల్ల ఒక్క అభిమాని కూడా బాధపడవద్దని అనుకుంటాడు అజిత్.

ఎంతగా దిగజారి పోయారంటే..
అయితే సైలెంట్ గా ఉండే ఈ ఇద్దరు హీరోల అభిమానుల బాధేమిటో గాని మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాలో పోటీలకు దిగుతున్నారు. ఎంతగా దిగజారి పోయారంటే బుతులతో హీరోల పేర్లను హ్యాష్ ట్యాగ్ లుగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. మొదట ఎవరు మొదలు పెడుతున్నారో గాని వీరి గొడవలకు లిమిట్స్ లేకుండా పోతోంది.

దిక్కుమాలిన ట్వీట్స్ వైరల్
మొన్న #crossbreedajith అంటూ విజయ్ ఫ్యాన్స్ క్రియేట్ చేయగా.. నిన్న #crossgendervijayfans అని అజిత్ క్రియేట్ చేశారు. ఇక ఒక టైమ్ సెట్ చేసుకొని సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ ట్వీట్స్ చేస్తారో తేల్చుకుందాం అనేలా దిక్కుమాలిన ట్వీట్స్ వేసుకుంటున్నారు. ఇది చూసి ఇతర నెటిజన్ల నుంచి కామెంట్స్ వస్తున్నాయి.

విజయ్, అజిత్ ఎలా ఉంటారంటే..
నిజంగా వీళ్ళ గొడవ గురించి తెలిస్తే ఆ స్టార్ హీరోలు సినిమాలు తీయడమే మానేస్తారని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ రేంజ్ లో అజిత్, విజయ్ ఫ్యాన్స్ గొడవలు జరుగుతున్నాయి. కానీ నిజానికి అజిత్, విజయ్ కి ఎలాంటి గొడవలు లేవు. వారు రెగ్యులర్ గా కలుసుకోరు. కానీ ఎక్కడైనా ఎదురుపడితే మాత్రం సన్నిహితంగా మాట్లాడుకుంటారు. అది చూసి కూడా అభిమానులు మారడం లేదు. మరి విళ్ళల్లో మార్పులు ఎప్పుడు వస్తాయో చూడాలి.