twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శంకర్ - కమల్ హాసన్.. రూ.180 కోట్లు ఖర్చు పెట్టి.. ఇలా వదిలేస్తే ఎలా?

    |

    బిగ్ బడ్జెట్ సినిమా ఆగిపోతే నిర్మాతకు ఎదురయ్యే కష్టాలు అన్ని ఇన్ని కావు. అయితే లైకా ప్రొడక్షన్ అధినేతలు ఏ క్షణాన శంకర్ ఇండియన్ 2 సినిమాను ఒప్పుకున్నారో గాని అసలు సినిమా పూర్తవుతుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి కూడా కమల్ హాసన్ కారణంగా ఈ సినిమాకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. అంత పెద్ద మడ్జెట్ సినిమాను మధ్యలో వదిలేస్తే ఎలా అనే కామేంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

    వర్థమాన తార నైనిషా బ్యూటిఫుల్ గ్యాలరీ..

    మొదలు పెట్టినప్పటి నుంచి కూడా

    మొదలు పెట్టినప్పటి నుంచి కూడా

    దర్శకుడు శంకర్ లైకా సంస్ధతో 2పాయింట్ ఓ కంటే ముందే రెండు సినిమాలు చేస్తానని కమిట్మెంట్ ఇచ్చాడు. ఇక 2.ఓ ముగియగానే ఇండియన్ 2ను సెట్స్ పైకి తెచ్చాడు. ఇక సినిమాను మొదలు పెట్టినప్పటి నుంచి కూడా కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి.

    చావుతప్పి కన్ను లొట్టబోయి..

    చావుతప్పి కన్ను లొట్టబోయి..

    మొదట్లో బడ్జెట్ వంటి విషయాల్లో చాలా సీరియస్ చర్చలు నడిచాయి. 2.ఓ తోనే చావుతప్పి కన్ను లొట్టబోయినంత పనయ్యిందని లైకా వాళ్ళు శంకర్ అడిగినంత ఇవ్వలేకపోయారు. చివరికి రూ.230 కోట్లకు తెగ్గొట్టినప్పటికి ప్లాన్ ప్రకారం అది సరిపోదని శంకర్ వాదిస్తూనే ఉన్నాడు.

    వాదోపవాదాలు నడిచాయి

    వాదోపవాదాలు నడిచాయి

    ఇక రాజకీయాల కారణంగా కమల్ గ్యాప్ ఇవ్వగా మధ్యలో యాక్సిడెంట్ వల్ల కూడా కమల్ కు నిర్మాతలకు మధ్య వాదోపవాదాలు నడిచాయి. బాధితులకు నష్టపరిహారం ఇవ్వడంలో లైకా అనుకున్నంత సహాయం చేయలేదని కమల్ మండిపడ్డారని టాక్ వచ్చింది. ఇక కోవిడ్ వలన మరింత ఆలస్యం అయ్యింది.

    మొండిగానే ప్రయత్నిస్తోంది

    మొండిగానే ప్రయత్నిస్తోంది

    ఇక షూటింగ్స్ మొదలైనా కూడా లైకా నుంచి సమాధానం రాకపోవడంతో శంకర్ మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. పూర్తిగా లైకా తప్పే ఉన్నట్లు శంకర్ వివరణతో అర్ధమయ్యింది. అయినప్పటికీ లైకా మొండిగానే ప్రయత్నిస్తోంది. శంకర్, కమల్ తో చర్చలు జరుపుకొని క్లోజ్ చేసే విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

    Recommended Video

    Actor Vivek Biography, తన ధ్యేయం ఇదే , రూమర్స్ నమ్మొద్దు | RIP Vivek Sir | Filmibeat Telugu
     180కోట్లు వృధా అయినట్లే?

    180కోట్లు వృధా అయినట్లే?

    ఇప్పటికే 180కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం 230కోట్లతో సినిమాను పూర్తి చేయాలని అనుకున్నారు. తుది దశలో ఉన్నప్పటికీ ఇంకా బడ్జెట్ విషయంలో సస్పెన్స్ వీడలేదు. శంకర్, కమల్ హాసన్ హడావుడి చూస్తుంటే ఇప్పట్లో ఇండియన్ 2ని టచ్ చేసేలా లేరు. ఒకవేళ సినిమా ఆగిపోతే ఖర్చు చేసిన 180కోట్లు వృధా అయినట్లే? మరి ఈ విషయంపై సస్పెన్స్ ఎప్పుడు విడుతుందో చూడాలి.

    English summary
    Stalwart actor-director duo Kamal Haasan and Shankar’s Indian 2 is facing trouble ever since it went on floors. Earlier this year, after an unexpected sad incident on the sets, the entire crew went under a huge shock. Three people lost their lives and a few members were injured severely.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X