»   » వీడియో: మలయాళీ పిల్ల మళ్ళీ కన్ను కొట్టింది.. పిల్లగాడు గాల్లోకి, కొత్త టీజర్‌కు కుర్రాళ్ళు మటాష్!

వీడియో: మలయాళీ పిల్ల మళ్ళీ కన్ను కొట్టింది.. పిల్లగాడు గాల్లోకి, కొత్త టీజర్‌కు కుర్రాళ్ళు మటాష్!

Subscribe to Filmibeat Telugu
మలయాళీ పిల్ల మళ్ళీ కన్ను కొట్టింది.. పిల్లగాడు గాల్లోకి, కొత్త టీజర్‌కు కుర్రాళ్ళు మటాష్!

టీనేజ్ ప్రేమ కథతో సాధారణ చిత్రంగా ప్రారంభమైన ఓరు ఆధార్ లవ్ చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అంతా మలయాళి పిల్ల ప్రియవారియర్ మహిమే. ఓరు ఆధార్ లవ్ చిత్రం అంటూ ఒకటి తెరకెక్కుతోందని పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ టీజర్ విడుదలయ్యాక, ప్రియా వారియర్ కన్నుగీటిన విధానం చూసి యువత మొత్తం ఆమెకు దాసోహమైపోయారు. కొన్ని నెలలపాటు ఆ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము దులిపింది. ఆ తరువాత తుపాకీ గురిపెట్టినట్లు ముద్దు ఇచ్చే వీడియో కూడా అంతే స్థాయిలో పాపులర్ అయింది. తాజాగా మరో టీజర్ విడుదల చేసారు. ఈ టీజర్ లో మరో మారు ప్రియవారియర్ తన కన్నుగీటు ప్రతిభని బయట పెట్టింది.

దేశవ్యాప్తంగా సంచలనం

దేశవ్యాప్తంగా సంచలనం

ప్రియా ప్రకాష్ వారియర్ అనే పేరు ఇప్పుడు సాధారణమైనది కాదు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం ప్రియా వారియర్ జపం చేస్తున్నారు. ప్రియా వారియర్ కన్నుగీటిన వీడియోకు రిషి కపూర్ లాంటి సీనియర్ హీరోనే దాసోహమైపోయాడంటే ఇక కుర్రాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మరో టీజర్

తాజగా ఓరు ఆధార్ లవ్ చిత్ర యూనిట్ తమిళ సాంగ్ టీజర్ ని విడుదల చేసింది. ఈ టీజర్ లో కూడా ప్రియా వారియర్ కన్ను గీటింది. స్కూల్ లాబొరేటరీలో ప్రియ వారియర్, రోషన్ అబ్దుల్ రొమాన్స్ తో ప్రారంభం అవుతుంది.

పిల్లగాడు గాల్లోకి

పిల్లగాడు గాల్లోకి

స్కూల్ ఆవరణంలో రోషన్.. ప్రియా వారియర్ వెంట పడుతుంటాడు. ఆమె అదమైన హావభావాలతో చిరు నవ్వు నవ్వుతూ ఉంటుంది. ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూసి కన్ను కొడుతుంది. అంతే పిల్లగాడు గాల్లోకి తేలిపోతాడు.

దుమ్మురేపుతున్న టీజర్

దుమ్మురేపుతున్న టీజర్

ప్రస్తుతం ఈ తమిళ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోమారు ఈ టీజర్ తో ప్రియా వారియర్ యువత హృదయాల్లో కలవరం రేపే విధంగా ఉంది.

English summary
Oru Adaar Love Tamil Song Teaser. Priya Prakash Varrier once again makes sensation
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X