twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' గురించి ఎ.ఆర్.రహమాన్ ఇలా..

    By Srikanya
    |

    చెన్నై: రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్బుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్లను వసూలు చేసిన చిత్రాల క్లబ్‌లోకి చేరింది. అదే సమయంలో సినీ ప్రముఖలందరి ప్రశంసలూ పొందుతోంది. తాజాగా ఎఆర్ రహమాన్ ఈ చిత్రం గురించి ఇలా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో రాసుకొచ్చారు. మీరే చూడండి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    " 'లైఫ్ ఆఫ్ పై', చిత్రం తర్వాత ఇండియన్ మాస్టర్ పీస్ బాహుబలి నన్ను సెడ్యూస్ చేసింది. మనం ఇలాంటివి చేయగలం...ఇంకా చేయగలం ..."అనే అర్దం వచ్చేలా స్పందించారు.

    ఇక తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.303 కోట్లను వసూలు చేసినట్లు సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దక్షిణాది చిత్రాల్లో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన 'రోబో' చిత్రం పేరిట ఉన్న రూ.290కోట్ల రికార్డును బాహుబలి బ్రేక్‌ చేసింది.

    హిందీలో విడుదలైన అనువాద చిత్రాల రికార్డుల సైతం బాహుబలి బ్రేక్‌ చేసింది. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం రూ.50 కోట్లను వసూలు చేసింది. శుక్రవారం విడుదలైన 'భజరంగీ భాయ్‌జాన్‌' చిత్రం కూడా బాహుబలిపై ప్రభావం చూపకపోవడం విశేషం.

    మొదటి వారంలో 22.58 కోట్ల షేర్ సాధించిన బాహుబలి సినిమా సెకండ్ వీకెండ్ లో శుక్రవారం 1.54కోట్ల షేర్, శనివారం 2.08కోట్ల షేర్ మరియు ఆదివారం 2.12కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా మొదటి 10 రోజుల్లో 28.32కోట్ల షేర్ ని సాధించింది.

     Oscar Winner AR Rahman Praises Baahubali

    ఇక సినిమా చూసిన వారందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి హాలీవుడ్ స్థాయిలో తీశాడంటూ ప్రశంసిస్తున్నారు. పాత్రలు వేటికవే సాటిగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యపాత్రధారులు విశ్వరూపం చూపించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా రమ్యకృష్ణ గొప్పగా నటించారని చెబుతున్నారు. అవంతికగా తమన్నా ఒదిగిపోయిందని అంటున్నారు.

    హీరో ప్రభాస్, విలన్ దగ్గుబాటి రానా పోటీపడీ నటించారని తెలిపారు. క్లైమాక్స్ లో 45 నిమిషాలు సాగిన యుద్ధసన్నివేశాలు హైలెట్ గా నిలిచాయని తెలిపారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ రేంజ్ లో ఉన్నాయన్నారు. ఇక సినిమా ప్రముఖులు కూడా మాస్టర్ పీస్ అంటూ పొగుడుతున్నారు. ప్రస్తుతం వస్తున్న స్పందనను బట్టి చూస్తే 'బాహుబలి' భారీ హిట్ అయ్యే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    ఒక్క హైదరాబాద్ లోనే సినిమా లిస్టింగ్స్ చూస్తే.. బాహుబలి కాకుండా మిగిలినవి మూడు నాలుగు సినిమాలే. అవి కూడా ఉన్నది రెండు మూడు థియేటర్లలోనే. ఈ రేంజిలో విడుదల చేసిన బాహుబలి... ఇండస్ట్రీ అంచనాలకు తగినట్లుగానే వసూళ్లు చేసింది.

    ఒక్క మొదటి రోజే తెలుగు వెర్షన్ ఒక్కటే 30.7 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్ ఓపెనింగ్స్ లో ఇప్పటివరకు ఏ సినిమా సాధించనంత స్థాయిలో తొలిరోజు కలెక్షన్లు రావడంతో.. ఇక తమిళ, హిందీ వెర్షన్లు కూడా కలిపితే ఇది 60 కోట్లు దాటింది.

    అమెరికాలో తెలుగు వెర్షన్ కు మూడు రోజులు కలిపి 34,56,605 డాలర్లు.. అంటే, 21.91 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు అమెరికాలో ఇంత వసూళ్లు రాలేదు. ఆగండి.. అప్పుడే అయిపోలేదు. అక్కడ తమిళ వెర్షన్ కూడా రిలీజైంది. దానికి కూడా మొదటి మూడు రోజుల్లో 98.82 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే రెండూ కలిపితే దాదాపు రూ. 23 కోట్లన్న మాట.

    English summary
    Rahman posted on his Facebook page, "After 'life of Pi', the Indian masterpiece Bahubali seduced me all the way to the theatre and back with a lingering good taste ..Feeling Yes! we can do this and even more ..." .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X