మల్టీ టాలెంటెడ్ గ్లామరస్ హీరోయిన్ కి ప్రసంశల వెల్లువ..?!
ఎదిగే కొద్దీ ఒదిగుండే తత్వం శృతీహాసన్ ది… ఈ మాట అంటున్నది ఎవరో కాదు… స్వయంగా ఆమెతో కలిసి పని చేసిన దర్శక, నిర్మాతలే. బహుముఖప్రజ్ఞతో ప్రేక్షకులను, సంస్కారంతో దర్శక, నిర్మాతలను కట్టిపడేశారామె. ఇదే పద్ధతి కొనసాగిస్తే… అనతికాలంలోనే శృతి అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయం అని సినీ వర్గాల అంచనా. నటిగా తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న శృతి… గాయనిగా కూడా తన సత్తా చాటే పనిలో పడ్డారు.
శింబు హీరోగా తమిళంలో రూపొందుతోన్న 'దబాంగ్" రీమేక్ 'ఓస్తీ" చిత్రంలో 'మున్నీ బదానామ్" పాటను తమిళంలో శృతి ఆలపించారు. బాలీవుడ్ లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాట తమిళంలో కూడా అంతకు మించిన సంచలనాన్ని సృష్టిస్తుందని ఆ పాట విన్నవారందరూ అంటున్నారట. అభినయానికి, సంగీతానికి సమ ప్రాధాన్యతనిస్తూ…. మల్టీ టాలెంటెడ్ గ్లామరస్ హీరోయిన్ గా తన సత్తా చాటుకుంటున్నారామె.
తెలుగులో సిద్దార్థ్ హీరోగా రూపొందుతోన్న 'ఓమై ఫ్రెండ్", ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న కెఎస్ రామారావు సినిమా, పవన్ కళ్యాణ్ సరసన 'గబ్బర్ సింగ్" చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న శృతి… తమిళంలో సూర్య, మురుగదాస్ ల 'సెవెన్త్ సెన్స్", ధనుష్ హీరోగా రూపొందుతోన్న 'త్రీ" చిత్రాల్లో కూడా నటిస్తూ మరింత బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











