Nayanthara wedding: పెళ్లి రోజే మంచి పనికి శ్రీకారం.. నిరుపేదల దీవెనల కోసం ఇలా..
సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార మొత్తానికి తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట నేడు ఉదయం నవ దంపతులు గా సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. అయితే పెళ్లి రోజే నయనతార ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది. కేవలం స్టార్స్ సెలబ్రెటీల దీవెనలు మాత్రమే కాకుండా ఆమె సాధారణ జనాల దీవెనలు కూడా ఉండాలి అని ఒక మంచి పని చేయడానికి సిద్ధమైంది. నయనతార గురించి ఎవరికీ తెలియని కొన్ని కోణాలు కూడా ఉన్నాయి. ఇక ఆమె చేసిన మంచి పని ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..

మొదట అక్కడ అనుకొని..
అంగరంగ వైభవంగా మహాబలిపురంలో అతికొద్దిమంది కుటుంబ సభ్యులు సెలబ్రెటీల సమక్షంలో హిందూ సంప్రదాయ ప్రకారం నయనతార విగ్నేష్ శివన్ ఏడు అడుగులు వేశారు. అసలైతే నయనతార తనకు ఎంతో ఇష్ట దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అందుకోసం ప్రత్యేకంగా తిరుపతిలో పెళ్లి చేసుకోవడానికి ప్రత్యేకంగా చర్చలు కూడా జరిగాయి. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో మహాబలిపురంలో వివాహానికి వేదిక సిద్ధం చేసుకుంది.

నయన్ సొంత ఖర్చుతో..
దర్శకుడు విగ్నేష్ శివన్ తన పెళ్లి గురించి చాలాసార్లు వివరణ ఇచ్చినప్పటికీ నయనతార మాత్రం ఎక్కడ మీడియా సమావేశాలలో పెళ్లి గురించి ప్రస్తావన ఇవ్వలేదు. వీలైనంతవరకు వారి మ్యారేజ్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ప్రైవసీ తోనే ఉంచాలని అనుకుంది. ఆమె పెళ్లి కోసం తన సొంత ఖర్చులతో ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది.

పెళ్లి సందర్భంగా
ఇక నయనతారకు తమిళ నాడులో అభిమానుల సంఖ్య గట్టిగానే ఉంది. ఆమె ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మూడు పదుల వయసు దాటినా కూడా నేటి తరం హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా తన స్టార్ రేంజ్ ను కొనసాగిస్తోంది. ఇక పెళ్లి సందర్భంగా అభిమానుల ఆశీర్వాదం కూడా ఉండాలని ఆమె కోరుకుంది.

వారికోసం విందు
ఒక పెళ్లి రోజు ప్రత్యేకంగా నయనతార ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది. కేవలం పెళ్లికి వచ్చిన వారికి మాత్రమే కాకుండా చాలామంది నిరుపేదలకు కూడా విందు భోజనం అందించాలని ఆమె నిర్ణయం తీసుకుంది. అందుకోసం భారీగానే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో నయనతార ప్రత్యేకంగా తన మేనేజర్స్ తో మాట్లాడే ప్రణాళిక సిద్ధం చేసుకుందట. ఎలాంటి ఐటమ్స్ పంపించాలి అనే విషయంలో కూడా ఆమె నిర్ణయమే ఫైనల్ అని తెలుస్తోంది.

లక్షమంది కోసం..
ఇక నయనతార విగ్నేష్ శివన్ పెళ్లి రోజు తమిళనాడులోని నిరుపేదల కుటుంబాలకు చాలావరకు విందు భోజనాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దాదాపు లక్షమందికి నయనతార భోజనాలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఆమె పెళ్లి రోజు ప్రత్యేకంగా లేని వారికి కడుపు నింపాలి అని నిర్ణయం తీసుకోవడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నాయి.
ఇక ఇదే తరహాలో నయనతార రానున్న రోజుల్లో పేదలకు భోజనం పెట్టే విధంగా నిర్ణయం తీసుకుంటుందట. అయితే ఇంత చేసినా కూడా ఆమె ఇప్పటివరకు ఆ విషయంపై ఇలాంటి పబ్లిసిటీ కూడా చేసుకోలేదు. అదంతా నయనతార గొప్పతనమే అని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











