For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బూతు డోసు ఎక్కువైంది.. నచ్చకపోతే చూడొద్దంటున్న బిగ్ బాస్ బ్యూటీ!

    |

    తమిళ చిత్రం 90 ఎమ్ఎల్‌ ట్రైలర్ వివాదాస్పదంగా మారింది. తమిళ బిగ్ బాస్‌ షో కంటెస్టెంట్ ఓవియా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ తరం అమ్మాయిలు కొందరు ఎలాంటి స్వేచ్ఛా జీవితం కోరుకుంటున్నారు అనే అంశం ఫోకస్ చేస్తూ రూపొందించారు.

    అయిటే ట్రైలర్లో బూతు సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగులు, అమ్మాయిలు సిగరెట్లు, మద్యం సేవించడం లాంటి సీన్లు ఉండటంతో సినిమాపై విమర్శలు వస్తున్నాయి. సెన్సార్ బోర్డ్ సైతం ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే తమ సినిమాను విమర్శిస్తున్న వారికి ఓవియా తగిన సమాధానం ఇచ్చారు.

    ట్రైలర్ చూసి సినిమాను డిసైడ్ చేయవద్దు

    ట్రైలర్ చూసి సినిమాను డిసైడ్ చేయవద్దు

    ట్రైల‌ర్ చూసి సినిమా మొత్తం అదే ఉంటుందని ఎలా డిసైడ్ చేస్తారు? అని ఓవియా ప్రశ్నించారు. స్వేచ్ఛ‌గా జీవించే మ‌హిళ‌ మనోభావాలను ఫోకస్ చేసే విధంగా కొన్ని సీన్లు ఉన్న మాట నిజమే.. వాటిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదన్నారు.

    మద్యం, సిగరెట్ పురుషులకు మాత్రమేనా?

    మద్యం, సిగరెట్ పురుషులకు మాత్రమేనా?

    మద్యం, సిగరెట్ సేవిస్తున్న సీన్లు పురుషులపై చిత్రీకరించినపుడు లేని అభ్యంతరం మహిళలపై చిత్రీకరిస్తే తప్పేంటని ఓవియా ప్రశ్నించారు. పురుషాధిక్య సమాజంలో ఇలాంటి అభ్యంతరాలు వస్తాయని తాను ముందే ఊహించినట్లు తెలిపారు.

    ఆ విషయాల్లో నన్ను ఫోలో అవ్వొచ్చు

    ఆ విషయాల్లో నన్ను ఫోలో అవ్వొచ్చు

    ప్రజలు సినిమా స్టార్లను తమ రోల్ మోడల్‌గా ఎందుకు తీసుకుంటారో తెలియదు. నా తల్లిదండ్రులే నా రోల్ మోడల్. నేను వారిని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాను. మీరు నన్ను రోల్ మోడల్‌గా తీసుకోవాలనుకుంటే నా పర్సనల్ లైఫ్‌ను ఫాలో అవ్వండి. సినిమాల్లో నటించే విషయాలను ఫాలో అవ్వొద్దు. నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిని. తాగి వాహనం నడపను, పబ్లిక్ ప్లేసులో పొగ త్రాగను, టాక్స్ చెల్లిస్తాను. నేను నిజ జీవితంలో చేసే ఈ విషయాలను ఫాలో అవ్వండి. 90 ఎంఎల్ చిత్రంలో ఓవియా కేవలం నటి. డైరెక్టర్ ఏమి చెబితే అది చేస్తుంది అని చెప్పుకొచ్చారు.

    కష్టమైతే చూడటం మానేయండి

    మీకు అలాంటి సన్నివేశాలు చూడటం కష్టమైతే చూడటం మానేయండి అంటూ ఓవియా కాస్త ఘాటుగానే... విమర్శకులు చేస్తున్న వారికి సమాధానం ఇచ్చారు. సినిమా రిలీజ్ కోసం మా టీం మొత్తం వెయిట్ చేస్తోంది, అభిమానులతో కలిసి సినిమాను చూస్తామన్నారు.

    90 ఎంఎల్

    అలగియ అసుర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ శింబు సంగీతం అందిస్తుండటం విశేషం. మార్చి 1న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Oviya is gearing up for her next movie, ‘90 ML’, which is all set to hit the screens on the 1st of March. The trailer of the film got released recently and sparked various controversies due to the 18+ content shown in the trailer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X