For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దమ్ముంటే అరెస్ట్ చేసుకో.. సర్కార్‌కు సవాల్ విసిరిన బిగ్‌బాస్ బ్యూటీ

  |

  తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ ఓవియా హెలెన్ రాజకీయపరమైన విమర్శలు చేస్తూ వివాదాల్లో కూరుకుపోవడం సర్వసాధారణంగా మారింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ పనితీరుపై, ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ మీడియా పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ పర్యటనపై కామెంట్లు చేయడం, ఆ తర్వాత ఆమెపై చెన్నైలో కేసు నమోదు కావడం పెద్ద వివాదంగా మారింది. ఇప్పుడు మరోసారి ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె చేసిన కామెంట్ల వివరాల్లోకి వెళితే..

  అక్షర గౌడ ఫుల్ ఫ్రీగా క్లీవేజ్ షో.. బికినీలో మరింత ఘాటుగా, నాటుగా

  గతంలో ప్రధాని నరేంద్రమోదీపై

  గతంలో ప్రధాని నరేంద్రమోదీపై

  దక్షిణాది సినీ ప్రముఖుల్లో ఎక్కువ మంది ప్రధాని నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. కొద్దికాలంగా ఓవియా హెలెన్ విమర్శలు చేస్తుండగా, ఆమెకు సినీ నటుడు సిద్దార్థ్ కూడా తమిళనాడు ఎన్నికల సమయంలోను, కోవిడ్ విజృంభిస్తున్న సమయంలోను దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఇక రాంగోపాల్ వర్మ సంగతి చెప్పనక్కర్లేదనే విషయం కొత్తేమి కాదు.

   ప్రభుత్వ విధానాలపై విమర్శలు

  ప్రభుత్వ విధానాలపై విమర్శలు

  ఇక ఓవియా హెలన్ సోషల్ మీడియాలో పదునైనా వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓవియా ఆర్మీ అకౌంట్‌తో కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గతంలో తమిళనాడు పర్యటనకు వచ్చిన మోడీని గో బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో గందరగోళాన్ని నెలకొల్పింది.

  ఇది డెమాక్రసీనేనా?

  ఇది డెమాక్రసీనేనా?

  తాజాగా Is this democracy or democrazy ??? (ఇది ప్రజాస్వామ్యమేనా లేదా క్రేజీకి డెమోనా అనే విధంగా కామెంట్ చేసింది. ఈ విమర్శతోపాటు #ArrestMeToo అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసింది. దాంతో మరోసారి ఓవియా తీరు చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారనే వాదన వినిపిస్తున్నది.

   ఢిల్లీలో అరెస్టుల నేపథ్యంలో

  ఢిల్లీలో అరెస్టుల నేపథ్యంలో

  ఓవియా హెలెన్ ఇలా తీవ్రంగా స్పందించడానికి కారణమేమిటంటే.. దేశంలోని పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్లను ఎందుకు మోదీ ప్రభుత్వం ఇతర దేశాలకు ఎగుమతి చేసిందనే ఢిల్లీ కొందరు ప్రశ్నిస్తూ పోస్టర్లను ప్రదర్శించారు. అలా నిరసన తెలిపిన వారిలో 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ నన్ను కూడా అరెస్ట్ చేయమని సవాల్ విసిరి ఉంటుందనే కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

  అరెస్ట్ చేసే దమ్ముందా? అంటూ

  అరెస్ట్ చేసే దమ్ముందా? అంటూ

  ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా #ArrestMeToo చేసిన కామెంట్‌కు సపోర్టుగా ఓవియో హెలెన్ ట్వీట్ చేసిందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. అయితే ఈ వివాదాస్పద ట్వీట్‌పై నెటిజన్లు తలో విధంగా స్పందిస్తున్నారు. అయితే ఓవియా ఫ్యాన్స్ మాత్రం ధైర్యంగా సవాల్ విసిరారు అంటూ ప్రశంసిస్తున్నారు.

  Bigg Boss Malayalam 3 News | Filmibeat Telugu
  ఓవియా సినీ కెరీర్ ఇలా..

  ఓవియా సినీ కెరీర్ ఇలా..

  ఓవియా హెలన్ అసలు పేరు నెల్సన్ హెలెన్. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటిస్తున్నారు. కంగారు అనే చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే కలవాణి అనే చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. తెలుగులో ఇది నా లవ్ స్టోరి సినిమాలో నటించారు. ప్రస్తుతం బ్లాక్ కాఫీ, రాజాభీమా, సంభవం అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

  English summary
  South actress Oviya Helen has Challenged Government by tweeting Arrest Me Too. She wrote in twitter that.. Is this democracy or democrazy ???. she added #ArrestMeToo with tweet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X