లిప్ లాక్స్‌తో రెచ్చిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. ట్రైలర్ చూస్తే '90ఎంఎల్' ఏసినట్లే!

Recommended Video

90ML - Official Trailer

హీరోయిన్ ఓవియా పేరు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో మారుమోగుతోంది. ఓవియా తమిళ బిగ్ బాస్ 1 లో పాల్గొంది. అంతకు ముందు కూడా ఓవియా హీరోయిన్ గా నటించింది. కానీ ఒవియాకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఓవియా జాతకం ఒక్కసారిగా మారిపోయింది. లక్షలాది మంది ఆమెకు అభిమానులుగా మారిపోయారు. ఈ షో తర్వాత ఓవియా నటిస్తున్న తొలి చిత్రం 90 ఎంఎల్. ఈ చిత్రానికి అనిత ఉదీప్ దర్శకురాలు. ఈ చిత్రానికి తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలయింది. ఓవియా తన అభిమానులందరికి షాక్ ఇస్తూ అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రంలో నటించింది.

 90 ఎంఎల్‌తో షాక్

90 ఎంఎల్‌తో షాక్

90 ఎంఎల్ చిత్రంలో ఓవియా ప్రధాన పాత్రలో నటిస్తుంది అంటే అంతా లేడీ ఓరియెంటెడ్ చిత్రం అని అనుకున్నారు. బిగ్ బాస్ తర్వాత ఓవియా చేస్తున్న తొలి చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. కానీ 90 ఎంఎల్ ట్రైలర్ విడుదల కాగానే ఓవియా అభిమానులు సైతం కంగుతిన్నారు. పూర్తిగా అడల్ట్ కంటెంట్, బూతు డైలాగులు ఉన్న ఈ ఛితంలో ఓవియా లిప్ లాక్స్, శృంగార భరిత సన్నివేశాల్లో రెచ్చిపోయింది.

అదే ఫార్ములా

అదే ఫార్ములా

నలుగురు యువతుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాళ్ళ జీవితంలో ఎదురైన సంఘటనలు.. ప్రపంచాన్ని మరచిపోయి శృంగార జీవితం, మద్యం, సిగరెట్లుతో వాళ్ళు ఎంజాయ్ చేసిన విధానం.. చూస్తుంటే ఈ తరహాలోనే 90 ఎంఎల్ చిత్రం సాగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ తరహా చిత్రాలు కామన్ అయిపోయాయి. బాలీవుడ్ లో వచ్చిన వీర్ దే వెడ్డింగ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ పేరుతో వచ్చిన వెబ్ సిరీస్ ఈ తరహా కథలే.

జీర్ణించుకోలేకున్న ఫ్యాన్స్

జీర్ణించుకోలేకున్న ఫ్యాన్స్

ఈ చిత్రంలో ఓవియా బోల్డ్ గా నటిస్తూనే టామ్ బాయ్ తరహాలో కనిపించింది. ఓవియా అవతారం, శృంగార సన్నివేశాలు చూసి ఆమె అభిమానులు సైతం జీర్ణించుకోలేకున్నారు. బిగ్ బాస్ సమయంలో ఓవియా తమిళనాడు వ్యాప్తంగా అభిమానులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. ఓవియా కోసం ఓవియా ఆర్మీని కూడా ఏర్పాటు చేశారు. అడల్ట్ చిత్రంతో ఓవియా ఉన్న క్రేజ్ నాశనం చేసుకుంటోందని ఆమెపై అప్పుడే ట్రోలింగ్ మొదలైపోయింది.

 మహిళలకు ఆదర్శం అనుకున్నా

మహిళలకు ఆదర్శం అనుకున్నా

ఓ అభిమాని సోషల్ మీడియాలో.. ఓవియా అందరిలాంటి హీరోయిన్ కాదు. ఆమెని చాలా మంది అభిమానిస్తారు. యువతులు ఆమెని ఆదర్శంగా తీసుకుంటారు. కానీ నీవు ఇలాంటి చిత్రంలో నటించి వారందరిని తప్పుడు మార్గంలో పయనించేలా చేస్తున్నావు. ఇలాంటి చిత్రాన్ని నీ నుంచి అస్సలు ఊహించలేదు అంటూ ఓ నెటిజన్ తన నిరాశని వ్యక్తం చేశాడు.

ఇలాంటి సినిమాలు ఎందుకు

ప్రభుత్వం పోర్న్ సైట్స్ ని బ్యాన్ చేస్తోంది. మరి ఇలాంటి చిత్రాల్లో చూపిస్తున్నది పోర్న్ కాదా. ఇలాంటి వల్గర్ సినిమాలని ఎందుకు బ్యాన్ చేయడం లేదు అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. ఒక మహిళా దర్శకురాలు ఈ చిత్రాన్ని తెరకెక్కించిందంటే ఆశ్చర్యంగా ఉంది అని మరో అభిమాని కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటె ఓవియా బోల్డ్ రోల్ లో నటించడాన్ని కొంతమంది అభిమానులు సమర్థిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X