ఆయనతో ఎప్పుడైనా, ఎక్కడైనా.. శింబు గురించి హాట్ హీరోయిన్!
తమిళ చిత్ర పరిశ్రమలో హీరో శింబుకు లవర్‌బాయ్‌గా పేరున్న సంగతి తెలిసిందే. గతంలో పలువురు హీరోయిన్లతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోడం, ఆ తర్వాత బ్రేకప్ జరిగిపోవడం తెలిసిందే. తాజాగా శింబు, బిగ్‌బాస్ ఫేం, యువ హీరోయిన్ ఓవియా మధ్య అఫైర్ టాప్ న్యూస్‌గా మారిపోయింది. తాను హాట్‌హాట్‌గా నటించిన 90ml సినిమా ప్రచారంలో భాగంగా ఓవియా తన అఫైర్ గురించి పెదవి విప్పింది. ఓవియా ఏమన్నారంటే..

ప్రేమ ఎప్పుడైనా, ఎక్కడైనా పుట్టొచ్చు
శింబుతో అఫైర్ గురించి ఓవియా మాట్లాడుతూ.. ప్రేమ ఎప్పుడైనా, ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ మా మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ మాత్రమే. మా మధ్య ప్రేమ, అఫైర్ లాంటివి లేవని చెప్పగలను. ప్రేమకు, స్నేహానికి మధ్య తేడా ఉంది అని అన్నారు.

నా కష్టసుఖాల్లో భాగమై..
శింబు మంచి వ్యక్తి. నా కష్టసుఖాలను అర్ధం చేసుకోలడు. అందుకే ఆయనకు నా వ్యక్తిగత విషయాలు వెల్లడిస్తాను. ఏదైనా సమయంలో నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడితే అతడిని సలహా అడుగుతాను. ఏదైనా సహాయం కోసం ఏ సమయంలోనైనా కాల్ చేసే చనువు ఉంది అని ఓవియా పేర్కొన్నది.

నా సమస్యలకు పరిష్కారం ఇస్తాడు
నా వ్యక్తిగత సమస్యలను అర్ధం చేసుకోవడమే కాకుండా పూర్తి సహకారం అందిస్తుంటాడు. చక్కటి పరిష్కారాలను సూచిస్తుంటాడు. తన చుట్టు ఉండే వాళ్లకు వెన్నముకగా ఉంటాడు. శింబు నా జీవితంలో ఉండాలని కోరుకొంటాను అని ఓవియా వెల్లడించింది.

హాట్ హాట్‌గా 90mlలో ఓవియా
ఇక కెరీర్ విషయానికి వస్తే, ఓవియా ప్రస్తుతం 90ml సినిమాలో నటించింది. అడల్ట్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం మార్చి 1న రిలీజ్ కానున్నది. ఇందులోని సన్నివేశాలు ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. హాట్ హాట్ సన్నివేశాలతో కూడిన ట్రైలర్ దాదాపు 9 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం.


Click it and Unblock the Notifications











