twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ 'చంద్రముఖీ' సీక్వెల్ కన్నడంలో మెగా హిట్...

    By Srikanya
    |

    రజనీకాంత్ తో చంద్రముఖి వంటి సూహర్ హిట్ ఇచ్చిన పి.వాసు తాజాగా ఆప్తరక్షక అనే కన్నడ చిత్రాన్ని రూపొందించారు. ఆప్తమిత్ర(చంద్రముఖి కన్నడ వెర్షన్)కి సీక్వెల్ గారూపొందిన ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ (లేటు) విష్ణు వర్ధన్ ఈ చిత్రంలో హీరోగా చేసారు. ఆయన చివరి,మరియు 200వ చిత్రం ఇది. విమలా రామన్, సంధ్య హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సందర్బంగా దర్శకుడు పి.వాసుని మా చెన్నై ప్రతినిధి కలసి ముచ్చటించటం జరిగింది. ఆయన ప్రస్తుతం చేస్తున్న పులివేషం సెట్ లో ఈ ఇంటర్వూ జరిగింది. ఈ సక్సెస్ ని ఎలా తీసుకుంటున్నారు అనగా పి.వాసు...సాధారణంగా మేము సినిమా విజయాన్ని మూడు రకాలుగా అంచనా వేస్తూంటాం.మొదటిది ప్రేక్షకులు చూసి సినిమాను మెచ్చుకోవటం..రెండు మా సొంత తృప్తి...మూడవది...నిర్మాత కళ్ళల్లో ఆనందం...అయితే ఈ చిత్రం ఈ మూడు రకాలుగా విజయం సాధించిందని చెప్పవచ్చు.

    గ్రాఫిక్స్ గురించి చెప్పమంటే...మేం...ఈ చిత్రం కోసం దాదాపు 35 లక్షల రూపాయలు గ్రాఫిక్స్ పై ఖర్చు పెట్టాం. కన్నడ చిత్రాల బడ్జెట్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. దాంతో ఈ విజయం మరింత ఛాలెంజ్ గా మారింది. ఎలాగయినా హిట్ చేయాలనే కసితో చేసాను..అందులోనూ నా మిత్రుడు విష్ణు వర్ధన్ ఇఫ్పుడు లేరు...ఆయన చివరి చిత్రం ఇది. ఇది మిస్ ఫైర్ కాకూడదు...అనే ఆలోచన...నన్ను వెంటాడింది..అయితే నా ప్రయత్నం వృధా పోలేదు.అదే ధైర్యంతో తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాను.అనగా మరి రజనీకాంత్ గారు ఏమన్నారు...అంటే...ఆయన ఈ చిత్రాన్ని ప్రత్యేకమైన స్క్రీనింగ్ వేయించుకుని చూసారు...ఆయన చాలా ఎంజాయ్ చేసారు..చేస్తారో..లేదో అన్న విషయం చెప్పలేను..ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో బాగా ఎమోషన్ ఫీలియ్యారు. అసలు ఈ సినిమా ప్రారంభం నుంచి ఎలా వస్తోందంటూ ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు...అయితే ఏ నిర్ణయం ఇంకా డిసైడ్ కాలేదు...అలాగే నా ప్రస్తుత దృష్టి మొత్తం పులి వేషం చిత్రం పైనే ఉంది. ఇది చిన తంబి లాంటి గొప్ప కథ అంటూ ముగించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X