ట్రైలర్ అదిరింది: హీరోగా ఎంట్రీ ఇచ్చిన సింగర్ విజయ్ యేసుదాసు
భారతీయ ప్రముఖ సినీ గాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న యేసుదాసు వారసత్వంతో సినిమా రంగంలోకి పెట్టి గాయకుడిగా సక్సెస్ అయ్యాడు ఆయన తనయుడు విజయ్ యేసుదాసు. తాజాగా విజయ్ యేసుదాసు హీరోగా తెరంగ్రేటం చేశాడు. 'పడైవీరన్' అనే తమిళ సినిమాలో నటించాడు.
'పడైవీరన్' ట్రైలర్
'పడైవీరన్' చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ధనా దర్శకత్వం వహించారు.

పోకిరీ పోలీస్ ఎలా అయ్యాడు?
ఈ చిత్రంలో విజయ్ ఓ పోకిరి పాత్రలో కనిపించబోతున్నారు. పోకిరీగా తిరిగే హీరో పోలీస్ ఎలా అయ్యాడు? పోలీస్ అయిన తర్వాత అతడు ఏం చేశాడు అనే ఇతివృత్తంతో ఈ ట్రైలర్ సాగుతుంది.

దర్శకుడు భారతీ రాజా ఓ కీలక పాత్ర
ఈ చిత్రంలో హీరోయిన్‌గా అమృతా నటిస్తోంది. దర్శకుడు భారతీ రాజా ఓ కీలక పాత్రను పోషించారు. కార్తీక్ రాజా అందించిన సంగీతం ట్రైలర్లో ఆకట్టుకునే విధంగా ఉంది.

లుక్ బావుంది
విజయ్ యేసుదాసు లుక్ చూడటానికి బావుందని, హీరో పాత్రలకు బాగా సూటవుతాడని, 'పడైవీరన్' ట్రైలర్ చాలా బావుందని ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











