హీరోయిన్ పై ఇంగ్లీషు తిట్ల వర్షం

By Staff


హీరోయిన్లంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇష్టమే కాదు హీరోయిన్లు ఓకే అంటే ప్రాణం ఇచ్చేవాళ్లు కూడా ఉంటారు. వీరోరకమైన వాళ్లయితే మరో రకం వాళ్లు ఉంటారు. వీరికి హీరోయిన్లంటే మహా చులకన. కనిపిస్తే కళ్లతోనే రేప్ చేస్తారు. వీలయితే చెయ్యేస్తారు. ఇంటావిడను చూస్తే ఒకటి పోసుకునేవాళ్లు సైతం హీరోయిన్ కనిపిస్తే మగటిమను ప్రదర్శిస్తారు.

ఇలాంటి సంఘటన తమిళ నటి పద్మప్రియ విషయంలో జరిగింది. ఇది జరిగింది తమిళనాడు లో మాత్రం కాదు. చదువుకున్నవారు ఎక్కువగా ఉన్న కేరళలో జరిగింది. వివరాలలోకి వెళదాం...కొద్ది నెలల క్రితం పద్మప్రియకు గుర్తుతెలియని వ్యక్తి ఒకరు అసభ్య ఎస్ఎమ్ఎస్ ను పంపించారు. దీనికి ఆగ్రహించిన పద్మప్రియ కొట్టాయం కోర్టులో కేసు వేసింది. కోర్టు ఆదేశం మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు అసభ్య ఎస్ఎమ్ఎస్ పంపిన వ్యక్తి దొరికాడు. ఆయన పలక్కాడ్ కు చెందిన ఉపాద్యాయుడు వినోద్ కుమార్. ఈయనను పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. కాగా కేసు విషయమై పద్మప్రియను స్వయంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ముఖం కనిపించకుండా దుపట్టా వేసుకుని పద్మప్రియ హాజరైంది. అయినా మనవారు ఊరుకుంటారా...ఆమెను గుర్తుపట్టారు..హీరోయిన్ కోర్టుకు వచ్చిందహో అంటూ సంతోషం పట్టలేక అరుపులు కేకలు...గుంపు పెరుగుతూనే ఉంది..పెరగడమే కాదు మీదమీదకు వచ్చేస్తోంది...దీనిని సహించలేకపోయిన పద్మప్రియ(ఎంబిఎ) ఇంగ్లీష్ లో తిట్టడం ప్రారంభించింది. అదేమన్నా తమిళనాడా ఇంగ్లీషు అర్థం కాకపోవడానికి..అది కేరళ ఆయే. ఆమె ఒక తిట్టు తిట్టగానే వంద తిట్లు ఆమె తినాల్సివచ్చింది..ఈ తిట్ల దండకం గంటపాటు సాగింది. తిట్ల పరిస్థితి విషమిస్తుండడంతో పోలీసులు కల్పించుకొని ఆమెను రక్షించారు. ఆ తరువాత రెండు గంటలపాటు కోర్టులో విచారణ నిమిత్తం గడిపిన పద్మప్రియ ఆ తరువాత వేగంగా కోర్టు బయటకు వచ్చి స్పీడ్ గా తన కారు ఎక్కింది. అదీ సంగతి...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X