రజనీ హిమాలయ యాత్ర రహస్యం కనుక్కున్న హీరోయిన్
రజనీసార్...అంత సూపర్ స్టార్ అయినా...అంత నిడారంబరంగా, ప్రశాంతంగా ఎందుకుంటారో నాకు హిమాలయ యాత్ర చేసి వచ్చాక కానీ అర్థం కాలేదు. నిజంగా అది నా జీవితంలో మరపురాని యాత్ర అంటోంది పద్మ ప్రియ. రీసెంట్ గా తెలుగులో అందరి బంధువయా చిత్రంలో చేసిన పద్మప్రియ ఈ మధ్యనే హిమాలయ యాత్ర చేసి వచ్చింది. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందిస్తూ...ఇలాంటి యాత్ర చేస్తేనే జీవిత సత్యం ఎవరికైనా తెలిసేది. 11 రోజులు ఈ యాత్రలో పాల్గొన్నాను. ఎన్నో పుణ్యతీర్ధాలు సందర్శించాను. అక్కడకు వెళ్లాక బాహ్య ప్రపంచం అతా కృత్రిమ ఆనందాన్ని మాత్రమే ఇస్తుందని, అశాశ్వతమైన బాహ్య సౌందర్యం పాకులాడటం అనవసరం అని తెలుసుకున్నాను. అసలైన సౌందర్యం ఏంటో కూడా అర్థమైంది' అని చెప్పారు పద్మప్రియ.


Click it and Unblock the Notifications











