హీరో విజయ్ ఆఫీసులో వ్యక్తి అనుమానాస్పద మృతి.. నోట్లో సగం, చేతిలో సగం పరోటా?

వరుస సినిమాలతో హీరో విజయ్ దూసుకు వెళుతున్నారు. తమిళనాట ఆయనకు హీరో అజిత్ కి మధ్య గట్టి పోటీ ఉంటుంది. అయితే విజయ్ కి రాజకీయాల్లోకి వెళ్లాలని ఉన్నా సరే ఎందుకో వెనక్కి తగ్గుతున్నారు. తన తండ్రి రాజకీయాల్లోకి వెళ్లాలని ఆసక్తి చూపిస్తున్నా విజయ్ మాత్రం తొందరపడడం లేదు. కొందరు తండ్రీ కొడుకుల మధ్య దూరం పెరిగిందని అంటుంటే మరికొందరు అది బయట వరకే లోలోపల అంతా ఒకటే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే విజయ్ ఆఫీస్ లో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

 పార్టీ పునరుద్ధరణ పనులు

పార్టీ పునరుద్ధరణ పనులు


చెన్నైలోని పనైయూర్‌లో స్టార్ హీరో, తలపతి విజయ్ కార్యాలయం సమీపంలో ఒక వ్యక్తి శవమై కనిపించాడు. విజయ్ రాజకీయ పార్టీ అయిన విజయ్ మక్కల్ ఇయక్కమ్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తి చెన్నైలో పార్టీ కార్యాలయ ఆవరణలో శవమై కనిపించాడు. ప్రభాకర్ కాంట్రాక్టర్ అని అతను ప్రస్తుతం విజయ్ మక్కల్ ఇయక్కమ్ పార్టీ కార్యాలయం పునరుద్ధరణ పనులు చేస్తున్నాడని అంటున్నారు.

 కాంట్రాక్ట్ ఉద్యోగిగా

కాంట్రాక్ట్ ఉద్యోగిగా


దళపతి విజయ్ అభిమానులు 'విజయ్ మక్కల్ ఇయక్కమ్' అనే పార్టీని స్థాపించారు. విజయ్ తండ్రి సహాయంతో వారే సొంతంగా కార్యకలపాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని పనైయూర్‌లో ఆ పార్టీ భవనం ఉంది. ప్రస్తుతం అక్కడ పార్టీ బిల్డింగ్‌ను ఆధునికీకరిస్తుండగా.. ప్రభాకరన్ అనే వ్యక్తి ఆ పనుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని అంటున్నారు.

 పరోటా తిందామని

పరోటా తిందామని


కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులను చూసేందుకు వెళ్లిన ప్రభాకరన్.. గురువారం రాత్రి తాను పనిచేస్తున్న భవనం వద్దకు వచ్చాడని అంటున్నారు. గురువారం రాత్రి ప్రభాకర్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి సూపర్‌వైజర్‌ నుంచి ఒక 100 రూపాయలు తీసుకుని పరోటా తిందామని కొనేందుకు వెళ్ళాడు. అలా వెళ్లిన మనిషి ఉదయం అనుమానాస్పద స్థితిలో మరణించారు. అందులో నోటిలో, చేతిలో పరోటా ఉందని అంటున్నారు.

 గొంతు పట్టేసి ఉండవచ్చని

గొంతు పట్టేసి ఉండవచ్చని


ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో హార్డ్ ఫుడ్ తినడానికి ప్రయత్నించిన సమయంలో అతని గొంతు పట్టేసి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

పైడిపల్లి దర్శకత్వంలో

పైడిపల్లి దర్శకత్వంలో


ఇక విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆయన ఆ సినిమా 'తలపతి 66' షూటింగ్‌లో ఉన్నాడు. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభు, శరత్‌కుమార్, జయసుధ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, కిక్ శ్యామ్, కుష్బూ, సంగీత క్రిష్, సంయుక్త సహా యోగి బాబు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X