twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాత్రికి రాత్రే ఆ నిర్ణయం తీసుకున్నా! : విశాల్‌

    By Srikanya
    |

    Vishal Krishna
    చెన్నై : నిర్మాతగా మారాలన్నది ఓ రోజు రాత్రి హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం. సుశీంద్రన్‌ ఈ సినిమా కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మరుసటి రోజు ఉదయం ఆయనకు ఫోన్‌ చేసి సినిమాను నేనే నిర్మిస్తానని చెప్పా. ఆరోజే 'విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ' అనే బ్యానరును నమోదు చేయించా. వాస్తవానికి అప్పట్లో నా చేతిలో డబ్బుల్లేవ్‌. కానీ ఆత్మవిశ్వాసంతో తప్పకుండా సినిమాను నిర్మించగలనని అనుకున్నా. ఇప్పుడు పదిరెట్లు మెరుగ్గా సినిమా పూర్తవుతోంది. భారతిరాజాతో, ఆయన కుమారుడిగా నటించడం సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమలో ఓపిక, పట్టుదల చాలా ముఖ్యమని నాన్న చెప్పారు. ఇక్కడ గెలుపోటములు ఉంటాయి వాటిని చూసి కుంగిపోకూడదని కూడా అన్నారు. నా జీవితంలో ఆయన మాటలను అడుగడుగునా అనుసరిస్తున్నాను అని విశాల్ అన్నారు.

    సుశీంద్రన్‌ దర్శకత్వంలో విశాల్‌ నటిస్తున్న తాజా చిత్రం'పల్నాడు'( 'పాండియనాడు'). డి.ఇమాన్‌ సంగీతం సమకూర్చారు. సీనియర్‌ దర్శకులు భారతిరాజా ఇందులో విశాల్‌కు తండ్రిగా నటించారు. 'విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ' బ్యానరుపై విశాల్‌ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న తొలిచిత్రం 'పాండియనాడు'. ఈ సినిమా తెలుగులో 'పల్నాడు'గా తెరకెక్కుతోంది. ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలోని సత్యం థియేటర్‌లో జరిగింది. తండ్రీకొడుకుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియోను విశాల్‌ తండ్రి జీకే రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాల్ ఇలా స్పందించారు.

    విశాల్‌ను సహాయ దర్శకుడిగా చూసినప్పుడు ఆనందపడ్డా. నటుడిగా మారాక రెండింతలు సంతోషించా. ఇప్పుడు నిర్మాతగా మారాక.. ఇంతకన్నా ఆనందం ఏముంటుందో చెప్పండి. నేను ఎక్కడికి వెళ్లినా.. 'విశాల్‌ నాన్న' అంటూ గుర్తుపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తన వల్ల ఎంతో గౌరవం దక్కుతోంది. పెద్ద కుమారుడు నిర్మాతగా మరోవైపు ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. చాలా ఆనందంగా ఉంది అని జీకే రెడ్డి అన్నారు.

    ఖుష్బూ మాట్లాడుతూ... విశాల్‌ నటుడిగా 'చెల్లమే', 'తామిరభరణి'.. వంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడు నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్నాడు. ఇందులోనూ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. హీరో, నిర్మాతగా 'పాండియనాడు' విశాల్‌కు టర్నింగ్‌పాయింట్‌ అవుతుంది. ఇదే బ్యానరుపై పలు చిత్రాలు తెరకెక్కించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా అన్నారు.

    పాటల రచయిత వైరముత్తు మాట్లాడుతూ... 'చెల్లమే' చూసినప్పుడే విశాల్‌ హీరోగా విజయబావుటా ఎగురవేస్తాడని అనుకున్నా. అదేవిధంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిర్మాతగా వేస్తున్న అడుగు కూడా దిగ్విజయం కావాలని అనుకుంటున్నా. ఈ సినిమా వల్ల ధనంతోపాటు మరింత పేరు సిద్ధించాలని కోరుకుంటున్నా. విశాల్‌ తొలిచిత్రం 'చెల్లమే', సంగీత దర్శకుడు డి.ఇమాన్‌ తొలిచిత్రం 'తమిళన్‌'కు పాటలు రాశా. ఇప్పుడు వాళ్లిదరూ కలసి రూపొందిస్తున్న తొలిచిత్రం 'పాండియనాడు'కూ రాయడం చాలా సంతోషంగా ఉంది. యువకులతో కలసి పనిచేస్తుంటే మనసు హాయిగా ఉంది అన్నారు.

    నిర్మాతల మండలి అధ్యక్షులు కేఆర్‌, చిత్ర హీరోయిన్ లక్ష్మీమీనన్‌, డి.ఇమాన్‌, నటి ఖుష్బూ, రమ్యా నంబీశన్‌, దర్శకులు సముద్రకని, పాండిరాజ్‌, శీనురామస్వామి, తిరు తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Vishal who is in a desperate need of a hit movie, says his upcoming action-drama "Pandiya Naadu" is a very important project in his career as everything worked in his favour while he was filming for it. "I'm sure even if Suseenthiran (director) and I do another film together, it will not come out as good as this film. Everything so far with regards to the film has worked in my favour, and therefore, I consider it a very important film in my career," Vishal told media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X