సమ్మర్‌లో మళ్లీ థియేటర్లలోకి పవన్ ‘పంజా’!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్ 'పంజా' సినిమా సమ్మర్లో మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. అయితే అది మన తెలుగు థియేటర్లలో కాదు. తమిళనాడు థియేటర్లలో. ఈచిత్రాన్ని వేసవిలో తమిళంలో 'కురి' పేరుతో అనువదించి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్‌కు తమిళనాట మంచి స్టార్ డైరెక్టర్ హోదా ఉంది. ఈ నేపథ్యంలో పంజా తమిళ వెర్షన్‌పై అక్కడ మంచి అంచనాలు నెలకొన్నాయి.
పవన్ కళ్యాణ్-సారా జాన్ డియాస్ జంటగా రూపొందిన పంజా సినిమా తెలుగులో డిసెంబర్ 9, 2001లో విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా పరాజయం పాలైంది. సినిమా తొలి రోజే మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. స్టయిలిస్ గా ఉండి, వపర్ స్టార్ గెటప్ అదరినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఈచిత్రం ఆకట్టుకోలేక పోయింది. మరి తమిళంలో ఈ చిత్రం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' చిత్రంలోనటిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హిందీలో సూపర్ హిట్ అయిన 'దబాంగ్' చిత్రానికి ఇది రీమేక్. ఇందులో పవన్ కొండవీడు పోలీస్ గా కనిపించనున్నాడు. బండ్ల గణేస్ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











