ఇంకోటి : ఈ రోజు సాయింత్రమే కమల్ 'దృశ్యం' రీమేక్...

By Srikanya

చెన్నై : కమల్‌ నటించిన 'ఉత్తమ విలన్‌' మే ఒకటో తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన తదుపరి చిత్రాలపై అందరి దృష్టీ పడింది. ముఖ్యంగా 'దృశ్యం' రీమేక్ పరిస్దితి ఏంటి అని ట్రేడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వచ్చిన వార్త కమల్ అభిమానులను ఆనందపరిచింది. అది మరేదో కాదు...ఈ రోజు సాయింత్రం ...ఈ చిత్రం ట్రైలర్ ని వదులుతున్నారు. ఉత్తమవిలన్ థియోటర్లలో ఈ ట్రైలర్ ప్రదర్శించే అవకాసం ఉంది.

కమల్ విశ్వరూపం చిత్రం ఇప్పుడప్పుడే విడుదల అయ్యే వాతావరణం కనపడటం లేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం విడుదల అయిన వెంటనే 'దృశ్యం' రీమేక్ విడుదల అవుతుందని భావిస్తున్నారు. కమల్ ...కి చెందిన వారు నుంచి కూడా జూన్‌లో 'పాపనాశం' చిత్రాన్ని విడుదల చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.

మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'దృశ్యం'. ఇటీవల తెలుగులో వెంకటేశ్‌ హీరోగా విడుదలైన ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తమిళ రీమేక్‌ 'పాపనాశం'లో కమల్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కమల్‌ భార్యగా గౌతమి నటిస్తున్నారు. చార్లి, కలాభవణ్‌మణి తదితరులు ప్రధానపాత్ర పోషించారు. జిబ్రాన్‌ సంగీతం సమకూర్చారు. తాజాగా నిర్మాణాంతర పనులు కూడా ముగించుకున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత విడుదల చేస్తారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Papanasam slated for release in June

'ఉత్తమవిలన్‌', 'పాపనాశం', 'విశ్వరూపం2'... ఇలా మూడు సినిమాలతో బిజీగా ఉన్న కమల్‌ హాసన్‌ తన తర్వాత సినిమా కోసం షూటింగ్‌ లొకేషన్స్‌ పరిశీలిస్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి కమల్‌ హాసనే దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కమల్‌ ఇటీవల మారిషస్‌ వెళ్లొచ్చారని సమాచారం. అయితే ఈ పర్యటన ఏ సినిమా కోసమో తెలియాల్సి ఉంది.

'ఉత్తమ విల్లన్‌' విషయానికి వస్తే...

ఇందులో మూడు భిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. 14వ శతాబ్ధానికి చెందిన కళాకారుడిగా, నేటి ట్రెండ్‌కు తగిన ఓ సుప్రీంస్టార్‌గానూ ఇందులో నటించారు కమల్‌. అయితే మూడో పాత్రనే అత్యంత గోప్యంగా ఉంచింది చిత్ర యూనిట్‌.

ఇందులో కమల్‌ గురువు 'దర్శకశిఖరం' కె.బాలచందర్‌ ముఖ్య భూమిక పోషించారు. అందువల్లే ఈ సినిమా కోసం కమల్‌ అభిమానులు మాత్రమే కాకుండా.. కె.బాలచందర్‌ కుటుంబీకులు, అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జెట్ స్పీడుతో యాభై పై బడిన వయస్సులోనూ కమల్ పరుగులు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కమల్‌హాసన్‌ నటించిన మూడు సినిమాలు 2015లో విడుదల కానున్నాయి. ‘ఉత్తమ విలన్‌', ‘విశ్వరూపం-2', ‘పాపనాశం'... (దృశ్యం రీమేక్) ఈ మూడు సినిమాలూ వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇలా కమల్‌ నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల కానుండటం గమనార్హం.

మరో విశేషమేమిటంటే... ఈ మూడు చిత్రాలకు గిబ్రన్‌ (రన్ రాజా రన్ చిత్రం సంగీత దర్శకుడు) సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘ఉత్తమవిలన్‌', ‘విశ్వరూపం-2' సినిమాలు ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నాయి. మలయాళ హిట్‌ సినిమా ‘దృశ్యం' రీమేక్‌ ‘పాపనాశం' ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

కేవలం 39 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేశారు. మలయాళ మాతృకను తెరకెక్కించిన జీతు జోసెఫ్‌ తమిళంలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తొడపుళలో ఇటీవల పతాక సన్నివేశాలను చిత్రీకరించారు. గౌతమి కమల్‌హాసన్‌ భార్యగా నటిస్తున్న చిత్రమిది.

దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత గౌతమినటిస్తున్న చిత్రమిదే కావడం గమనార్హం. మలయాళ మాతృక దర్శకుడు జీతూ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X