నీవు తోపు హీరోయిన్‌వైనా.. అలా చేస్తే కట్ చేస్తాం.. త్రిషపై భగ్గుమన్న నిర్మాతలు!
లేటు వయసులో కూడా వరస ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఆలరిస్తున్న అందాల భామ త్రిష ఓ కొత్త వివాదంలో కూరుకుపోయింది. తమిళ చిత్ర నిర్మాతలు ఆమెపై భగ్గుమంటున్నారు. ఏడాదిగా వాయిదా పడుతూ వస్తున్న సినిమాకు చేయూత ఇవ్వకపోవడంపై నిర్మాతలు మండిపడుతున్నారు. ఆమె తీరు సరిగా లేదని బహిరంగంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు త్రిష చేసిన పని ఏమిటంటే..

ఏడాది కాలంగా త్రిష సినిమా..
తమిళంలో పరమపదం విలయట్టు అనే సినిమా ఏడాది కాలంగా రిలీజ్‌కు నోచుకోలేదు. ఫిబ్రవరి 28వ తేదీన ఆ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసి నిర్మాతలు ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ఫిబ్రవరి 22వ తేదీన చెన్నైలోని సత్యం సినిమాస్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రమోషన్ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానించారు. కానీ కనీసం మాట చెప్పకుండా ఆ వేడుకకు గైర్హాజరయ్యారు.

రిలీజ్ కాకుండా ఆగిపోయింది
ఎంతో డబ్బు ఖర్చు చేసి సినిమాను రూపొందిస్తే ఏడాది కాలంగా రిలీజ్‌కు నోచుకోకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఎదో విధంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. ఈ సినిమాను ఎలాగోలా రిలీజ్ చేయకపోతే చాలా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. దాంతో మేము మరింత కష్టాల్లో కూరుకుపోతాం అని నిర్మాత, దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్ద హీరోల సినిమాలే..
మీడియాను ఉద్దేశించి నిర్మాత టీ శివ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ప్రమోషన్ లేకపోతే పెద్ద హీరోల సినిమాలే థియేటర్లలో నడవడం లేదు. పరమపదం విలయత్తు సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. ఈ సినిమాలో త్రిష లీడ్ క్యారెక్టర్ పోషించగా మిగితా నటీనటులంతా కొత్తవారే. అలాంటి సినిమాకు ప్రమోషన్ చేయకుండా నిరాకరించడం న్యాయమా అంటూ గోడును వెళ్లబోసుకొన్నారు.

ప్రమోషన్‌కు హాజరుకాకపోతే..
ప్రీ రిలీజ్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. ఈ వారంలో షెడ్యూల్ చేసిన కార్యక్రమాలకు హాజరై సినిమాను ప్రమోట్ చేస్తారని అనుకొంటున్నాం. ఆమె ప్రమోషన్‌కు రావడం వల్ల కొత్త నటీనటులకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మాది న్యాయమైన కోరిక. ఒకవేళ ప్రమోషన్‌కు హాజరుకాకపోతే ఆమె పారితోషికాన్ని కట్ చేస్తాం అని నిర్మాత శివ హెచ్చరించారు.

ఎంత తోపు హీరోయిన్‌వైనా..
పరమపదం నిర్మాత సురేష్ కమాచి కూడా త్రిషపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నటించిన సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరుకావాలనేది రిక్వెస్ట్ మాత్రమే. వారు స్టార్ యాక్టర్లు అనుకుంటే మాత్రం మీడియాను, ఫ్యాన్స్‌ను కలవరా? ఎంత స్టార్లైనా నిర్మాతల పరిస్థితిని అర్ధం చేసుకోవాలి అని సురేష్ అన్నారు.


Click it and Unblock the Notifications











