Parasakthi Censor Report: సెన్సార్ కోరల్లో పరాశక్తి.. శివకార్తీకేయన్ టీమ్ సంచలన నిర్ణయం!

తమిళ స్టార్ హీరో శివకార్తీకేయన్, సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం పరాశక్తి. ఇండియన్ పొలిటికల్ హిస్టారికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రరానికి సుధా కొంగర దర్శకత్వం వహించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి మథిమారన్ పుగజేంది కథను అందించారు.

తమిళనాడులో 60వ దశకంలో సాగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రంలో రవి మోహన్, అథర్వ, కులప్పులి లీల, దేవ్ రమానాథ్, పృథ్వీ రాజన్, గురు సోమసుందరం, బాసిల్ జోసెఫ్, షాజీ చెన్, పాప్రి ఘోష్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి రవీ కే చంద్రన్ సినిమాటోగ్రఫిని, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని, సతీష్ సూర్య ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమా సెన్సార్ పరమైన వివాదాల్లో చిక్కుకొన్నది. ఆ వివాదం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

Parasakthi Censor Report

పరాశక్తి చిత్రం మద్రాస్‌ నగరంలో 1960 దశకంలో జరిగిన హిందూ వ్యతిరేక ఉద్యమం బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన సామాజిక అంశంతో కూడిన చిత్రం. ఈ సినిమాలోని డైలాగ్స్, విజువల్స్ అప్పటి పరిస్థితులను, వాస్తవాలను ప్రతిబింబించే విధంగా దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించారు. అయితే ఇటీవల సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ రివ్యూకు వెళ్లగా.. అధికారులు, ప్రతినిధులు పలు సన్నివేశాలు,డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలను తొలగించాలని సూచించారు. దాంతో ఈ సినిమా సెన్సార్ పరమైన వివాదంలో చిక్కుకొన్నది.

అయితే సెన్సార్ బోర్డు ప్రతినిధులు తెలిపిన అభ్యంతరాలపై దర్శక, నిర్మాతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకవేళ వారు ప్రతిపాదించిన కట్స్, డైలాగ్స్‌ను తొలగిస్తే ఈ సినిమా గురించి చెప్పాలనుకొన్న కథ, దాని వెనుక ఉన్న ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. పిరియాడిక్ మూవీ. వాస్తవాలను ఎలా వక్రీకరిస్తాం అని దర్శకురాలు సుధా కొంగర తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సెన్సార్ బోర్డు అభ్యంతరాలపై పరాశక్తి సినిమా యూనిట్ సంచలన నిర్ణయం తీసుకొన్నది. ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి సమర్పించేందుకు సిద్దమయ్యారు. యాంటి హిందీ ఉద్యమానికి సంబంధించిన సన్నివేశాలను, సంభాషణలను తొలగించడానికి నిరాసక్తను వ్యక్తం చేస్తూ రివైంజింగ్ కమిటీకి వెళ్లారు. ఈ సినిమాను జనవరి 10వ తేదీనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X