twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్ మూవీకి సెన్సార్ చిక్కులు, ఆ సీన్ విషయంలోనే అసలు గొడవ!

    |

    బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం 'క్వీన్' సూపర్ హిట్ అవ్వడంతో... దీన్ని సౌత్ లాంగ్వేజ్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో 'పారిస్ పారిస్' పేరుతో రూపొందుతుండగా కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేస్తోంది.

    'పారిస్ పారిస్' మూవీ షూటింగ్ పూర్తయి చాలా కాలం అయింది. అయితే సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పంచాయితీ కేంద్ర సెన్సార్ బోర్డ్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమాలో కొన్ని డైలాగ్స్, విజువల్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని స్పష్టం చేసినట్లు సమాచారం.

    Paris Paris facing troubles from the censor board

    అయితే ఆ సీన్లు, డైలాగులు తొలగిస్తే సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని, సినిమాకు అడల్ట్ సర్టిఫికెట్ వచ్చినా ఫర్వాలేదు... వాటిని అలాగే ఉంచాలని కోరుతూ తాజాగా నిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీనిపై వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చనీయాంశం అయింది.

    ఇటీవల విడుదలైన ట్రైలర్ పరిశీలిస్తే... ఇందులోని ఓ సీన్లో కాజల్ ఎదబాగాన్ని మరొక నటి నొక్కుతున్నట్లు చూపించారు. ఈ సీన్ మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దీంతో పాటు కొన్ని బూతు పదాలు కూడా ఇందులో వాడినట్లు తెలుస్తోంది.

    'పారిస్ పారిస్' చిత్రాన్ని మీడియంట్ ఫిల్మ్స్ బేనర్లో మను కుమార్ నిర్మించారు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. సంగీతం: అమిత్ త్రివేది, సహ నిర్మాత: పరూల్ యాదవ్, డిఓపి: సత్య హెగ్డే.

    English summary
    Kajal Aggarwal's Paris Paris facing troubles from the censor board. CBFC panel has objected to certain cuss words and bold visuals. The makers have now approached the Revising Committee to get a censor clearance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X