Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కాజల్ మూవీకి సెన్సార్ చిక్కులు, ఆ సీన్ విషయంలోనే అసలు గొడవ!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం 'క్వీన్' సూపర్ హిట్ అవ్వడంతో... దీన్ని సౌత్ లాంగ్వేజ్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో 'పారిస్ పారిస్' పేరుతో రూపొందుతుండగా కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేస్తోంది.
'పారిస్ పారిస్' మూవీ షూటింగ్ పూర్తయి చాలా కాలం అయింది. అయితే సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పంచాయితీ కేంద్ర సెన్సార్ బోర్డ్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమాలో కొన్ని డైలాగ్స్, విజువల్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని స్పష్టం చేసినట్లు సమాచారం.
అయితే ఆ సీన్లు, డైలాగులు తొలగిస్తే సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని, సినిమాకు అడల్ట్ సర్టిఫికెట్ వచ్చినా ఫర్వాలేదు... వాటిని అలాగే ఉంచాలని కోరుతూ తాజాగా నిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీనిపై వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చనీయాంశం అయింది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ పరిశీలిస్తే... ఇందులోని ఓ సీన్లో కాజల్ ఎదబాగాన్ని మరొక నటి నొక్కుతున్నట్లు చూపించారు. ఈ సీన్ మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దీంతో పాటు కొన్ని బూతు పదాలు కూడా ఇందులో వాడినట్లు తెలుస్తోంది.
'పారిస్ పారిస్' చిత్రాన్ని మీడియంట్ ఫిల్మ్స్ బేనర్లో మను కుమార్ నిర్మించారు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. సంగీతం: అమిత్ త్రివేది, సహ నిర్మాత: పరూల్ యాదవ్, డిఓపి: సత్య హెగ్డే.