రామ్ చరణ్ తండ్రిగా ఆ తమిళ దర్శకుడు
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ తండ్రిగా తమిళ్ నటుడు,మరియు దర్సకుడు పార్తిపన్ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని తమిళ మీడియాకు పార్ధీపన్ చెప్పారు. ఆ పాత్ర చిన్నదైనా చాలా పవర్ ఫుల్ గా ఉందని, అందుకే ఒప్పుకున్నానని అన్నారు. అలాగే ఈ ప్రాజెక్టులో చేయటం చాలా ఆనందంగా ఉందని, చిరంజీవితో తన పరిచయంకి సార్ధకత చేకూరినట్లైంది అన్నారు. ఇక ఆ పాత్రని తన లేటు తండ్రి రాధాకృష్ణన్ ని గుర్తుకు తెస్తోందని ఎమోషనల్ గా అన్నారు.
ఇంతకుముందు పార్దీపన్ నటించిన యముడే నా మొగుడు వంటి చిత్రాలు డబ్బింగై వచ్చినా ఆయనది ఇదే స్టైయిట్ తొలి తెలుగు చిత్రం. ఇప్పుడు ఆయన తన తెలుగు డబ్బింగ్ తానే చెప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఇక తమిళంలో ఆయన 3డి చిత్రం అంబులి ఈ శుక్రవారం విడుదల కానుంది. అలాగే ఆయన మరో ప్రాజెక్టు అప్పు కూడా పైప్ లైన్ లో ఉంది. రామ్ చరణ్ రచ్చలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. సూపర్ గుడ్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు.


Click it and Unblock the Notifications











