గిరిజనులపై దారుణం.. శింబు మూవీకి టిక్కెట్టుతో వెళితే అవమానం.. దర్శకుడు సీరియస్
శిలంబరసన్ అంటే గుర్తుపట్టడం కష్టమే.. కానీ శింబు అని అందరూ పిలుచుకునే తమిళ స్టార్ హీరో నటించిన పతు తలా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే చెన్నైలోని ఫేమస్ రోహిణి థియేటర్‌లో పతు తలా సినిమా కోసం టిక్కెట్లు కొనుగోలు చేసినప్పటికీ.. ఒక గిరిజన కుటుంబాన్ని హాల్‌లోకి అనుమతించకపోవడంతో థియేటర్ యాజమాన్యాన్ని నెటిజెన్లు ఒక రేంజ్ లో ఏకిపారేశారు. ఆ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

మంచి రెస్పాన్స్
పతు తలా సినిమా గురువారం రోజు తమిళనాడులో భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమాకు మొదటి నుంచే ఓవర్గం ప్రేక్షకులు అంచనాలయితే గట్టిగానే ఉన్నాయి ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఈ సినిమాను థియేటర్లో చూడాలి అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక మొత్తానికి శింబు రేంజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో సినిమాకు మొదటి రోజే భారీ స్థాయిలో ఒపెనింగ్స్ వచ్చాయి.

ఆసక్తి పెంచుతున్న సినిమా
శింబు ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుతున్నాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో అతనికి ఎంతో కాలంగా మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు పతు తలా సినిమాకు కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఈ సినిమాను చూసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

వేషధారణ చూసి
అయితే ఇటీవల నారికురవ తెగకు చెందిన ఒక సంచార కుటుంబం దోమ తెరలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. వారు శింబు మీద అభిమానంతో సినిమా చూసేందుకు టికెట్ డబ్బులు పెట్టి కొనుగోలు చేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారి వేషధారణ చూసి రోహిణి థియేటర్ యాజమాన్యం వారిని లోపలికి అనుమతించలేదు.
మ్యూజిక్ డైరెక్టర్ రియాక్షన్
శింబు అభిమానులు చూసి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వెంటనే అది వైరల్ అయింది. ఈ అంశం మీద మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ కూడా స్పందించారు. సినిమా అనేది ఒక కళ దాన్ని చూడకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. వారిని సినిమా చూసే అవకాశం కల్పించాలి అంటూ ఆయన ట్వీట్ చేశారు.

కవర్ చేసుకునే ప్రయత్నం
ఈ దెబ్బతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారడంతో రోహిణి థియేటర్ యాజమాన్యం వెనక్కి తగ్గింది. అంతే కాదు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేసింది. అందులో భాగంగానే ఈ విషయంలో తమ పొరపాటు లేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఈ సినిమాకి సెన్సార్ అధికారులు యూఏ సర్టిఫికెట్ జారీ చేశారని ఆ యూఏ సర్టిఫికెట్ జారీ చేస్తే 12 సంవత్సరాల లోపు పిల్లలను సినిమా చూసేందుకు అనుమతించే అవకాశం లేదని పేర్కొంది.

తప్పుగా వెళ్ళిందని
వారితోపాటు 8, 12 ఏళ్ల పిల్లలు ఉండడంతో వారిని మాత్రమే లోపలికి అనుమతించే అవకాశం లేదని చెప్పామని ఇది బయటకు తప్పుగా వెళ్ళిందని పేర్కొంది. ఆ తరువాత షోలో వారికి సినిమా చూసే అవకాశం కల్పించామని చెప్పుకు వచ్చింది. మొత్తం మీద ఈ వ్యవహారం తమిళనాట చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











