Fact Check : ముస్లిం వ్యక్తితో పెళ్లి చెల్లదా? .. ప్రభుత్వాన్నే కుదిపేసిన హీరోయిన్ వివాహం, ఏం తేల్చారంటే?

మారుతున్న కాలానుగుణంగా భిన్న మతాలు, కులాలకు చెందిన స్త్రీ , పురుషులు వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. మతాంతర , కులాంతర వివాహాలను కొన్ని కుటుంబాలు స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పరువు హత్యలకు పాల్పడుతూ .. కడుపున పుట్టిన బిడ్డలను సైతం కిరాతకంగా హతమారుస్తున్నారు. సమాజంలో ఈ పోకడలు మార్చాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ హీరోయిన్ మతాంతర వివాహం చర్చనీయాంశమై ఏకంగా ప్రభుత్వమే జోక్యం చేసుకునే వరకు వచ్చింది.

బుల్లితెర నుంచి బిగ్‌స్క్రీన్‌కు వెళ్లిన పావని రెడ్డి తన ప్రియుడు అమీర్‌ను పెళ్లి చేసుకున్నారు. చెన్నైలో ఆదివారం జరిగిన వీరి పెళ్లికి సినీ ప్రముఖులు, ఇరు కుటుంబాలు, సన్నిహితులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే పావని రెడ్డికి ఇది రెండో వివాహం. తొలుత బుల్లితెరపై సత్తా చాటిన పావని రెడ్డి అనంతరం సినిమాల్లో బిజీ అయ్యారు. చారి 111, మళ్లీ మొదలైంది, గౌరవం, డ్రీమ్, డబుల్ ట్రబుల్ , అమృతం చందమామలో, వజ్రం, 465, సేనాపతి వంటి చిత్రాల్లో పావని అలరించారు. తెలుగుతో పాటు తమిళ్ తదితర భాషల్లోనూ ఆమె నటించారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నటుడు ప్రదీప్ కుమార్‌తో ప్రేమలో పడ్డ పావని రెడ్డి అతనిని పెద్దల అంగీకారంతో పెళ్లాడారు.

pavani reddy amir marriage is valid Tamil Nadu Govt Gave Clarity on bayilvan Ranganathan comments

అనూహ్యంగా ప్రదీప్ కుమార్ 2017లో ఆత్మహత్య చేసుకోవడం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి వ్యక్తం చేసింది. ఆయన ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనేది నేటికీ మిస్టరీయే. అయితే పావని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్లే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నారని అప్పట్లో సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ప్రదీప్ మరణం తర్వాతి నుంచి ఒంటరిగానే ఉంటున్న పావని కెరీర్‌పై ఫోకస్ పెట్టారు.

అయితే నిర్మాత ఆనంద్‌జాయ్‌తో పావని రెడ్డి ప్రేమలో పడ్డారని ఆయనను త్వరలోనే పెళ్లాడబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తమిళ బిగ్‌బాస్ సీజన్ 5 ఆమె జీవితాన్ని మలుపు తిప్పంది. ఈ సీజన్‌కు రన్నరప్‌గా నిలిచిన పావని రెడ్డి ..కొరియోగ్రాఫర్ ఆమీర్‌తో ప్రేమలో పడ్డారు. ఒకదశలో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ దశలో తాము ఏప్రిల్ 20న పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేసింది ఈ జంట. అనుకున్నట్లుగానే వివాహ బంధంతో వీరు ఒక్కటయ్యారు.

అయితే వీరి పెళ్లి జరగదని జర్నలిస్ట్, నటుడు బైల్వాన్ రంగనాథ్ పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. పావని హిందువని, అమీర్ ఇస్లాం మతస్తుడని.. అందువల్ల వీరిద్దరూ తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోలేరని, అందుచేత ఈ పెళ్లి చెల్లదని రంగనాథన్ పేర్కొన్నాడు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాడు ప్రభుత్వంలోని ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. రంగనాథన్ వ్యాఖ్యలు నిరాధారమని.. రెండు వేర్వేరు మతాలకు చెందిన స్త్రీ , పురుషులు చట్ట ప్రకారం తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రత్యేక వివాహ చట్టం కింద ఇందుకు వారికి హక్కులు ఉన్నాయని , చట్టపరంగా వారి పెళ్లిని రిజిస్టర్ చేయించుకోవచ్చని పేర్కొంది. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X