పవన్ కళ్యాణ్, విష్ణు వర్ధన్ కాంబినేషన్ స్టోరీ లైన్

By Srikanya

పవన్ కళ్యాణ్ తో తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ డైరక్ట్ చేసే చిత్రం భిళ్ళా ప్రీక్వెల్ గా రూపొందించనున్నారని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అజిత్ తో చేసిన భిళ్ళా చిత్రం సంచలన విజయం సాధించి తెలుగులోకి సైతం ప్రభాస్ తో రీమేక్ అయింది. ఇప్పుడా చిత్రం ప్రేక్వెల్ అంటే అసలు భిళ్ళా మాఫియాలోకి ఎలా ఎంటరయ్యాడు. నిల దొక్కుకునే సమయంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి..అన్న ఏంగిల్ లో కథను తయారు చేయాడని తెలుస్తోంది. అయితే భిళ్ళాకి భిళ్ళా2కి పోలిక కేవలం క్యారెక్టర్ కంటిన్యూషనే అని చెప్తున్నారు. ఇక స్టైలిష్ టేకింగ్ తీసే ఈ చిత్రాన్ని తమిళంలో అజిత్ తో భిళ్ళా-2 టైటిల్ తో ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఎక్కువ భాగం ఫారిన్ లొకేషన్స్ లో తీయాలని నిర్ణయించారు.

2011 ఫిబ్రవరిలో షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రాన్ని 2012 సంక్రాంతికి విడుదల చేయా లని ప్లాన్ చేస్తున్నారు. వేదం, మర్యాద రామన్న నిర్మించిన ఆర్కా మీడియా వారు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్...తమిళ దర్శకుడు కరుణాకరన్ తో చేసిన బాలు..ఎబిసిడి చిత్రం కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందిందే. ఇక విష్ణువర్ధన్ కి స్టైలిష్ దర్శకుడుగా మంచి పేరుంది. అజిత్ తో ఆయన రూపొందించిన భిళ్ళా ఆయనకి విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈ చిత్రానికి యువన్‌ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. 'గమ్యం', 'వేదం' చిత్రాల దర్శకుడు క్రిష్ సంభాషణలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి రచన: రాహుల్ కోడా, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్, కళ: సునీల్‌ బాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విష్ణువర్థన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X