twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ తమిళ చిత్రం రీమేక్ లో నటించాలని పవన్ కళ్యాణ్

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ తాజాగా తంబి వెట్టోతై సుందరమ్ అనే తమిళ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.విసి వడుదయం అనే దర్శకుడు డైరక్ట్ చేసిన ఈ చిత్రం కథ పవన్ కళ్యాణ్ విని, ఆ పాత్రలో తాను చేయాలని రైట్స్ తీసుకోబోతున్నారు. ఈ విషయమై దర్శకుడు లీడింగ్ మీడియా తో మాట్లాడుతూ...మా కెమెరామెన్ ఆంజనేయులు ఎన్నో తెలుగు సినిమాలకు పనిచేసారు. ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ కథ విని ఆసక్తి చూపించారు. ఆయన రైట్స్ తీసుకోవాలనుకుంటున్నారు. తెలుగులో కూడా ఈ చిత్రం బాగా వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నాము. మా నిర్మాత సెంధిల్ కుమార్ కూడా తెలుగులో ఈ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నారు.

    ఇక ఈ చిత్రంలో కరన్ హీరోగానూ, అంజలి(అంగడి తెరు హీరోయిన్) కలిసి చేసారు. కన్యాకుమారి జిల్లా మార్తాండంలో జరిగిన ఓ యధార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్ర కథ తమిళనాడులోని కన్యాకుమారి ప్రాతంలో జరుగుతుంది. ఆ ప్రాతంలో క్రైమ్ రేటు ఎక్కువ. అలాగే చదువులు కూడా ఎక్కువే. అక్కడ పిల్లలకు డిస్టిక్షన్స్ వస్తూంటాయి. అయితే అంతలా చదువుకునే వాళ్ళున్న ఏరియాలో ఎందుకు యువత..గూండాయిజం వైపు, క్రైమ్ వైపు మ్రొగ్గు చూపుతోంది అనే విషయాలు ఈ చిత్రంలో చర్చిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన కొమురం పులి చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. అలాగే పవన్ కళ్యాణ్ గతంలోనూ సుస్వాగతం, అన్నవరం, గోకులంలో సీత వంటి తమిళరీమేక్ చిత్రాలు చేసారు. ప్రస్తుతం లవ్ ఆజ్ కల్ అనే హిందీ చిత్రం రీమేక్ లో చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X