ఆ స్టైలిష్ డైరక్టర్ తో పవన్ కళ్యాణ్ నెక్ట్స్ కన్ఫర్మ్
కొమురం పులితో త్వరలో ముందుకు రానున్న పవన్ కళ్యాణ్ మరికొద్దిరోజుల్లో ఓ సంచలనమైన న్యూస్ తన అభిమానులకు ఇవ్వబోతున్నారు. అది మరేదో కాదు...స్టైలిష్ డైరక్టర్ గా పేరొందిన తమిళ దర్శకుడు విష్ణు వర్దన్ డైరక్షన్ లో ఓ చిత్రం కమిటయ్యారని తెలిసింది. విష్ణు వర్ధన్ తమిళంలో అజిత్ హీరోగా తీసిన భిళ్ళ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ చిత్రాన్నే మెహర్ రమేష్..ప్రభాస్ హీరోగా భిళ్లాగా తెలుగులోకి అనువదించారు. ఇక ఈ మేరకు విష్ణు వర్ధన్ తో పవన్ కల్యాణ్ చర్చలు పూర్తయ్యాయని, కథ కూడా ఓ కొలిక్కి వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ గా వినపడుతున్న న్యూస్. ఇక ప్రస్తుతం సింగీతం దర్శకత్వంలో జీసస్ క్ర్రీస్ట్ జీవిత కథతో రూపొందే కొండా కృష్ణంరాజు నిర్మించే చిత్రంలో పవన్ నటించటానికి ఇజ్రాయిల్ వెళ్ళారు.


Click it and Unblock the Notifications











