ఒకే దెబ్బకు రెండు పిట్టలు స్కీమ్ లో సెట్ చేసిన పవన్ కళ్యాణ్
గతంలోపవన్ కళ్యాణ్ కి ఖుషీ వంటి సూపర్ హిట్ ని ఇచ్చి ఆ తర్వాత లాంగ్ గ్యాప్ లో కొమురం పులి వంటి డిజాస్టర్ ఫిలిం ని ఇచ్చిన దర్శకుడు ఎస్.జె.సూర్య .పులి చిత్రం ప్లాప్ అయినా పవన్ కి సూర్య మీద నమ్మకం సడ లలేదు. దాంతో సూర్య మంచి కథకుడు అని అతనిచ్చే కథతో తాను సినిమా చేస్తాను గానీ డైరక్షన్ ఛాన్స్ మాత్రం ఇవ్వనని తేల్చి చెప్పేసాడు.
దాంతో సూర్య కథే ఇస్తానని స్టోరీ లైన్ వినిపించి పవన్ ని ఇంప్రెస్ చేసాడు. మరి దర్శకుడు ఎవరూ అంటే ప్రభుదేవా సోదరుడు డాన్స్ మాస్డర్ రాజు సుందరం. రాజు సుందరానికి పవన్ గతంలో సినిమా ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఇలా నిలబెట్టుకుంటున్నాడు. అటు సూర్యని తృప్తి పరిచినట్లుంటుంది.మరో ప్రక్క రాజు సుందరానికి ఆఫర్ ఇచ్చినట్లు ఉంటుందని పవన్ ప్లాన్.ఇక ఈ చిత్రాన్ని బివియస్ యన్ ప్రసాద్ నిర్మిస్తారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు రూటులో అలా సెట్చేసాడన్నమాట. పవనా ..మజాకా..


Click it and Unblock the Notifications











