తమిళంలో ఇతర భాషల నటులపై నిషేధం.. అలా అంటే కుదరదు.. పవన్ కల్యాణ్ సెన్సేషనల్ స్పీచ్
ది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (The Film Employees Federation of South India (FEFSI)) తమిళ సినిమాల్లో తమిళులకే అవకాశాలు ఇవ్వాలనే విషయంపై కఠిన నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను సినీ పరిశ్రమ ముందు ఉంచింది. తమిళ సినిమాల్లో తమిళ నటులే ఉండాలని సూచించింది. అలాగే తమిళనాడులోని సినిమాను పూర్తిగా చిత్రీకరించేందుకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నది.
అయితే తమ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన దర్శక, నిర్మాతలపై కఠినంగా చర్యలు తీసుకొంటామని ఫెఫ్సీ ఆదేశవాలు జారీ చేసింది. తాము రూపొందించిన నియమ నిబంధనలను పాటించకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించింది. ఈ హెచ్చరికలు, నిర్ణయాలపై బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందిస్తూ..

తమిళ సినీ పరిశ్రమకు నా విన్నపం. తమిళ పరిశ్రమ వారికే అవకాశాలు ఇవ్వాలనే నిర్ణయం నుంచి బయటకు రావాలని కోరుకొంటున్నాను. ఈ రోజు తెలుగు సినిమా పరిశ్రమ అందర్ని తీసుకొంటుంది. తమిళ పరిశ్రమ తమిళులకే అంటే సినీ పరిశ్రమ ఎదగదు. ఈ రోజు తెలుగు పరిశ్రమ ఎదుగుతున్నదంటే.. కారణం కేరళ, కన్నడ, తమిళ, హిందీ భాషల వారిని తీసుకోవడమే. కేరళ నుంచి వచ్చిన సుజిత్‌ను, హిందీ నుంచి వచ్చిన ఊర్వశి రౌటేలా, పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన నీతూ లుల్లాను తీసుకొంటాం. ఇలా ఒక్కరిని కాదు. అందరూ కలిస్తేనే సినిమా. మనమే ఉండాలి అనుకొంటే కుదరదు అని పవన్ కల్యాణ్ చెప్పారు.
తక్కువ పరిధిలో ఆలోచిస్తే కుంచిచుకుపోతాం. తమిళ సినీ పరిశ్రమ తమిళులకే అనే మాట నా వద్దకు వచ్చింది. ఈ రోజు సముద్రఖని ముందు ఓ మాట చెబుతున్నాను. అలాంటి చిన్న స్వభావం నుంచి బయటకు రావాలి. మీరు కూడా RRR లాంటి సినిమాలను మీరు కూడా తీయాలి. ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు తమిళం నుంచి రావాలి అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

తమిళం నుంచి రోజా, జెంటిల్మన్ వచ్చిందంటే.. ఏఎం రత్నం వల్లే. మనం పరిధి పెంచుకొంటూ వెళ్దాం. పరిధి దాటరు కాబట్టే తమిళ సినిమా పరిశ్రమ పెద్దదైంది. అందుకు కారణం తెలుగు వారైన ఏఎం రత్నం నిర్మాత కావడం వల్లే. తమిళ సినీ పరిశ్రమలో ఏవైనా సమస్యలు ఉంటే.. వాటిని పరిష్కరించుకోవాలి. ఓ కళాకారుడికి కులం, మతం ఉంటే కుదరదు. తమిళ సినిమా పరిశ్రమ పెద్ద మనసు చేసుకొని తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి అని పవన్ కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











