twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అత్తారింటికి దారేది రీమేక్, భారీ నిర్మాణ సంస్థ చేతుల్లో.. పవన్ సినిమాకు ఇప్పటికీ అదే క్రేజ్!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాబినేషన్ లో రూపొందుకున్న రెండవ చిత్రం అత్తారింటికి దారేది. అంతకు ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా చిత్రం మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వ మ్యాజిక్, పవన్ కళ్యాణ్ ఎనర్జీతో అత్తారింటికి దారేది చిత్రం ప్రతికూల పరిస్థితుల్లో విడుదలైనా ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. సమంత, ప్రణీత సుభాష్ హీరోయిన్లు గా నటించారు. తాజగా ఈ చిత్రం తమిళంలో రీమేక్ కాబోతోంది.

    లైకా ప్రొడక్షన్స్

    లైకా ప్రొడక్షన్స్

    లైకా ప్రొడక్షన్స్ పేరు ఇప్పడు ఎక్కువగా వినిపిస్తోంది. రజనీకాంత్ 2.0, మరికొన్ని భారీ చిత్రాలని ఈ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజగా అత్తారింటికి దారేది తమిళ రీమేక్ హక్కులని ఈ సంస్థ సొంతం చేసుకుంది.

    అదే క్రేజ్

    అదే క్రేజ్

    లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కు భారీ మొత్తం వెచ్చించి అత్తారింటికి దారేది హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాకు ఇప్పటికీ అదే క్రేజ్ ఉండడం విశేషం.

    ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

    ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

    అత్తారింటికి దారేది చిత్రం 2013 లో విడుదలయింది. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి అభిమానులు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కోరుకుంటారు. కానీ త్రివిక్రమ్ ఈ చిత్రంలో చిన్నపాటి ప్రయోగమే చేశాడు. పవన్ క్రేజ్ కు భిన్నంగా అత్తారింటికి దారేది చిత్రాన్ని అందమైన కుటుంబ కథా చిత్రంగా మలిచాడు.

     తమిళంలో ఎవరు

    తమిళంలో ఎవరు

    ఫ్యామిలీ చిత్రం అయినప్పటికీ ఎక్కడా పవన్ కళ్యాణ్ ఎనర్జీ మిస్ కాలేదు. ఇప్పుడు ఈ చిత్రం తమిళంలో రీమేక్ కాబోతుండడంతో హీరో ఎవరనే ఉత్కంఠ నెలకొంది. అజిత్, విజయ్ ఇలా ఈ చిత్రంలో నటించే హీరో ఎవరని తమిళ అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.

    English summary
    Pawan Kalyan-starrer ‘Attarintiki Daredi’ to be remade in Tamil. Lyca Productions will produce the film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X