స్క్రిప్టు దాకా ఓకే ..దర్శకత్వంలో వేలు పెట్టవద్దని వార్నింగిచ్చిన పవన్
పవన్ కల్యాణ్ కి దర్శకుడు ఎస్.జె సూర్య అంటే ఎనలేని గురి. పవన్ కెరీర్ లో బెస్ట్ స్క్రిప్టు మరియు సినిమా అయిన ఖుషీని ఆ దర్శకుడే ఇవ్వటంతో అతను అంటే విపరీతమైన నమ్మకం. అయితే అదే ఎస్ జె సూర్య ఆ మధ్య కొమురం పులి అనే డిజాస్టర్ చిత్రం ఇచ్చాడు. తలా తోకాలేని ఆ చిత్రం అందరితో విమర్శలు పాలయింది. అయితే మళ్ళీ పవన్ దగ్గరకు చేరిన సూర్య అతనికి ఓ లైన్ వినిపించి టెమ్ట్ చేసాట్ట. లైన్ బాగుంది కానీ డైరక్షన్ ఛాన్స్ ఇవ్వను అని మొహమాటం లేకుండా చెప్పిన పవన్ కేవలం నీ స్క్రిప్టుని మాత్రం నా సినిమాకు తీసుకుంటాను. అది గనుక వర్కవుట్ అయితే ఆ తర్వాత మళ్ళీ మన కాంబినేషన్ గురించి ఆలోచిద్దామని క్లియర్ గా చెప్పాట్ట. అలాగే అని ఎస్ జె సూర్య ప్రస్తుతం స్క్ర్రప్టు వర్క్ చేస్తూ పవన్ కి నేరేషన్ ఇఛ్చాడని తెలుస్తోంది. ఇక పవన్ ఆ స్క్రిప్టు కోసం డైరక్టర్ ని వెతుకుదామని, అయితే సూర్య మాత్రం పొరపాటున కూడా డైరక్షన్ లో వేలు పెట్టవద్దని హెచ్చరించాడని చెప్పాట్ట. ఇక పవన్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్సకత్వంలో గబ్బర్ సింగ్, విష్ణువర్ధన్ దర్శకత్వంలో షాడో చిత్రం, సింగీతం శ్రీనివాస రావు గారి దర్శకత్వంలో జీసస్ చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications