తమిళ పంజాకి టైటిల్ ఖరారు చేసిన విష్ణు...!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంజా చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతలా అంచనాలు పెరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గెటప్, ఈ సినిమాలోని డైలాగులు, పాటలు, దర్శకుడు విష్ణువర్థన్. కాగా ఈ సినిమాలోని కొన్ని డైలాగులు బయటికి లీకై మరింతగా అంచనాలను పెంచేస్తున్నాయి..ఈ చిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చేయబోతున్నరనే విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రానికి 'కూరి" అనే టైటిల్ ను ఖరారు చేసారు. 'కూరి" చిత్ర ఆడియోను డిసెంబరు ద్వితీయార్థంలో విడుదల చేయనున్నారు. ఈ చిత్ర దర్శకుడు విష్ణు వర్ధన్ తమిళంలో తీసిన 'అరింధుం యమలుం", 'పట్టియాల్" మరియు 'బిల్లా" వంటి చిత్రాలు తమిళనాట ఘన విజయాలు సాధించాయి. అతను తెలుగులో తీసిన మొట్టమొదటి చిత్రం పంజా.
'పంజా" చిత్రం త్వరలో మన ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ సరసన సారా జేన్ డియాస్ మరియు అంజలి లావనియా నటించారు. జాకీష్రాఫ్, అతుల్ కులకర్ణి, శేష్ అడివి. బ్రహ్మానందం, అలీ మరియు సుబ్బరాజు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని చాలా వరకు కలకత్తాలో చిత్రీకరించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఆడియో ఘన విజయం సాధించింది. పిఎస్.వినోద్ సినీమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. తెలుగులో డిసెంబరు 9 న విడుదలకు సిద్ధమవగా తమిళంలో వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications