పవన్ ను పవర్ స్టార్ అనిఎందుకంటారో తీన్ మార్ చూస్తే తెలుస్తుంది....

By Sindhu

పవన్ కళ్యాణ్ పవర్ ఏమిటన్నది తీన్ మార్ చిత్రం మరోసారి నిరూపిస్తోంది. కొమరం పులిలాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న చిత్రమైనా, అందరికీ తెలిసిన లవ్ ఆజ్ కల్ అనే హిందీ సినిమాకి రీమేక్ అయినా కానీ పవన్ తననెందుకు పవర్ స్టార్ అంటారనేది తీన్ మార్ సాక్షిగా చూసిస్తున్నాడు..

హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనూ తొలిరోజు 30షోలు వేస్తున్న ఈ చిత్రానికి అన్ని షోలు అడ్వాన్స్ లో ఫుల్ అయిపోయాయి. మిగిలిన మల్టీపెక్సులు, సింగిల్ స్ర్కీన్ లు కూడా అదే ఊపుతో ఫుల్ అయ్యాయి. ఇక ఏపీలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ తన పవరేంటో చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. చెన్నయ్ సిటిలో ఫస్ట్ డే అత్యధిక షోలు ప్రదర్శింపబడుతున్న తొలి తెలుగు చిత్రంగా తీన్ మార్ రికార్డ్ చేసింది. తమిళనాడు మొత్తంలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగానే జరిగాయి. పవన్ కళ్యాణ్ నటించిన ప్రేమకథా చిత్రాల్లో చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. ఆ నమ్మకంతోనే అభిమానులు తీన్ మార్ పై అంచనాలు పెంచేసుకున్నారు. ఆడియో యావరేజ్ గానే ఉన్నా కానీ ప్రీ రిలీజ్ అది ఆటంకం కాలేదు.

చాలా చోట్ల నిన్న రాత్రి నుంచే షోస్ పడిపోయిన దరిమిలా, సినిమాకి సంబంధించిన టాక్ చూచాయిగా బయటకు పొక్కేసింది. పవన్ గత సినిమాల్లా 'తీన్ మార్" అభిమానుల్ని ఏమాత్రం నిరాశపర్చదన్నది 'ఫస్ట్ టాక్". తీన్ మార్ ఆడియోలో 'ఓహో బస్తీ దొరసాని .." పాట ఎంత హిట్ అయిందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆడియోలోనే కాక స్ర్కీన్ పై కూడా ఈ పాటే హైలైట్ అని చెబుతున్నారు. ఈ పాట చూసినోళ్లు. మరికాసేపట్లో ఫైనల్ టాక్ రానున్న దరిమిలా, సినిమా టాక్ గురించి ఇప్పుడే చెప్పేయడం తొందరపాటే అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X