ప్రముఖ కెమెరామెన్ పిసి శ్రీరామ్ కుమార్తె యాక్సెడెంటెల్ డెత్
ఖుషి, సఖి వంటి చిత్రాలకు అద్బుతమైన కెమెరా పనితనం చూపిన పి.సి.శ్రీరామ్ ప్రస్తుతం ధుఖంలో మునిగిపోయారు. ఆయన 24 సంవత్సరాల కుమార్తె శ్వేత ఓ యాక్సిడెంట్ గా మరణించింది. శ్వేత..బిటెక్ గ్రాడ్యుయేట్, చెన్నైలోని ఓ సాప్ట్ వేర్ కంపినీలో పెద్ద పొజీషన్ లో ఉంది. నిన్న తన దీపావళి పండుగని తన స్నేహితులతో గడిపి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన ఆమె బాల్కనీలోంచి జారి క్రిందకి పడిపోయింది. నాలుగు అంతస్ధుల పైనించి పడటంతో వెంటనే మరణించింది. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి శవాన్ని పోస్ట్ మార్టమ్ కి పంపారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఫిల్మ్ పర్శనాలిటీలు ఆయనకు కండోలెన్స్ తెలియచేస్తున్నారు. ఇక ఆమె శరీరాని దహన కార్యక్రమాలును ఆమె సోదరుడు స్కంద ఆస్ట్రేలియానుంచి వచ్చాక జరుగుతుంది. ప్రస్తుతం పి.సి.శ్రీరామ్..రామ్ చరణ్ తేజతో తమిళ దర్శకుడు ధరణి రూపొందిస్తున్న మెరుపు చిత్రానికి పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications











