‘నా భర్త తాగుబోతు.. ఆడవాళ్ల పిచ్చి.. షూటింగు కోసం పెళ్లి అని మోసం’

ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్ కుమార్ పెళ్లి వివాదం కొత్త మలుపు తిరుగుతున్నది. వనితా విజయ్ కుమార్ తాజాగా పెళ్లి చేసుకొన్న భర్త పీటర్ పాల్ భార్య ఎలిజబెత్ హెలన్ కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. జూన్ 27వ తేదీన వనితా, పీటర్ పాల్ క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం తెలిసిందే. అనంతరం ఎలిజబెత్ హెలెన్ చెన్నైలోని వడపళని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో హెలెన్ మాట్లాడుతూ..

విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకొంటారా?

విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకొంటారా?

వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ పెళ్లికి చట్టబద్దత లేదు. నాకు విడాకులు ఇవ్వకుండానే వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. ఈ వ్యవహారంలో నా భర్త నన్ను మోసగించారు. పెళ్లి విషయంలో నాకు అబద్దాలు చెప్పి నమ్మించారు ఆయనపై అందుకే కేసు నమోదు చేశాను. నాకు న్యాయం జరిగే వరకు కోర్టులో న్యాయపోరాటం చేస్తాను అని ఎలిజబెత్ హెలెన్ అన్నారు.

నా భర్త తాగుబోతు.. తిరుగుబోతు

నా భర్త తాగుబోతు.. తిరుగుబోతు

భర్త పీటర్ పాల్‌పై ఎలిజబెత్ హెలన్ తీవ్ర ఆరోపణలు చేశారు. నా పీటర్ పాల్ తాగుబోతు, ఆడవాళ్లంటే పిచ్చి మీడియా ఇంటర్వ్యూలో ఆగ్రహంతో ఊగిపోయారు. నాతో పెళ్లి తర్వాత ఇప్పటికి ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొన్నారు. అందుకే మేము విడిపోయి 7 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నాం. నా కొడుకు, బిడ్డకు తండ్రి కావాలి తప్ప.. నాకు మరో విషయం అవసరం లేదు అని ఎలిజబెత్ హెలెన్ పేర్కొన్నారు.

షూటింగు కోసం పెళ్లి అని మోసం

షూటింగు కోసం పెళ్లి అని మోసం

వనితా విజయ్ కుమార్‌తో పెళ్లి గురించి నాకు చాలా అబద్దాలు ఆడి మోసం చేశారు. ఆమెతో పెళ్లి నిజం కాదు. సినిమా షూటింగు కోసం మేము పెళ్లి చేసుకొంటున్నాం. బయట మీడియాలో వస్తున్న వార్తలన్నీ రూమర్లు. వాటిలో వాస్తవం లేదని నాకు చెప్పారు. తీరా చూస్తే వనితాను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయన చేసిన మోసంతో నేను చాలా హర్ట్ అయ్యాను అని ఎలిజబెత్ అన్నారు.

డబ్బు కోసమే కేసు నమోదు అని వనితా విజయ్ కుమార్

డబ్బు కోసమే కేసు నమోదు అని వనితా విజయ్ కుమార్

ఇదిలా ఉండగా, పీటర్ పాల్‌పై భార్య ఎలిజబెత్ హెలెన్ దాఖలు చేసిన కేసుపై వనితా విజయ్ కుమార్ స్పందించారు. డబ్బు లాగేందుకే ఆమె ప్రయత్నిస్తున్నారు. కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అని వనితా ఆరోపణలు చేశారు. అయితే ఆ కేసుతో నాకు సంబంధం లేదు. పీటర్ పాల్, ఆయన భార్యకు సంబంధించిన విషయం అని వనితా కేసును తేలికగా తీసుకొన్నారు.

Recommended Video

Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
 ఇబ్బందిలో మూడో పెళ్లి?

ఇబ్బందిలో మూడో పెళ్లి?

ఇక వనితా విజయ్ కుమార్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. తన లైఫ్‌లో ఒక సహజీవనం తర్వాత ఇది మూడో పెళ్లి. గతంలో రెండుసార్లు విడాకులు తీసుకొని.. ఒక సహజీవనానికి బ్రేకప్ చెప్పారు. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో బిజినెస్‌మెన్, వీఎఫ్ఎక్స్ ఎడిటర్ పీటర్ పాల్‌ను వనితా విజయ్ కుమార్ వివాహం చేసుకొన్నారు. అయితే తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా పీటర్ పెళ్లి చేసుకోవడం ఇప్పుడు వివాదంగా మారింది. ఈ పెళ్లి విషయం ఎలాంటి మలుపు తిరుగుతందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X