twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెర్సల్‌కు మరో తలనొప్పి.. సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ పిటిషన్

    తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన మెర్సల్ చిత్రం రిలీజ్‌కు ముందు నుంచే అనేక వివాదాల్లో చిక్కుకున్నది. విడుదల తర్వాత కూడా మెర్సల్‌ను వివాదాలు చుట్టుముట్టడం ఆగడం లేదు.

    By Rajababu
    |

    తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన మెర్సల్ చిత్రం రిలీజ్‌కు ముందు నుంచే అనేక వివాదాల్లో చిక్కుకున్నది. విడుదల తర్వాత కూడా మెర్సల్‌ను వివాదాలు చుట్టుముట్టడం ఆగడం లేదు. తాజాగా మెర్సల్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలవ్వడం మరోసారి వివాదం రాజుకొన్నది. అయితే ఈ నెల 27న రిలీజ్‌కు సిద్ధమవుతున్న మెర్సల్ డబ్బింగ్ చిత్రం అదిరింది రిలీజ్‌పై కూడా నీలిమేఘాలు అలుముకున్నాయి.

     ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా..

    ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా..

    జాతీయ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా మెర్సల్ చిత్రాన్ని తెరకెక్కించారు. భారత్ ప్రభుత్వానికి సంబంధించిన అనేక అవాస్తవాలను చిత్రంలో చూపించారు అని ఆరోపణలు చేస్తూ ఏ అశ్వనాథమన్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

     ప్రజలను తప్పుదారి పట్టించేలా..

    ప్రజలను తప్పుదారి పట్టించేలా..

    మెర్సల్ చిత్రంలోని చాలా సన్నివేశాలు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. ప్రధానంగా వస్తు, సేవల పన్ను విధానం గురించి తప్పుగా చూపించారు. చట్టాలను కించపరిచే విధంగా ఉన్న ఏ చిత్రం కూడా ప్రదర్శనకు అనర్హం అని అశ్వనాథన్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

    మెడికల్ మాఫియాపై ధ్వజం

    మెడికల్ మాఫియాపై ధ్వజం

    ఇదిలా ఉండగా, మెడికల్, ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియాపై ధ్వజమెత్తుతూ రూపొందించిన మెర్సల్ చిత్రాన్ని దర్శకుడు అట్లీ రూపొందించారు. ఈ చిత్రంలో డిజిటల్ ఇండియా, జీఎస్టీపై తీవ్రమైన వ్యాఖ్యలు ఉన్నాయి. దాంతో రాజకీయంగా ఈ చిత్రం వివాదమైంది. బీజేపీ నేతలు కొన్ని సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

    150 కోట్ల వసూళ్లు

    150 కోట్ల వసూళ్లు

    విజయ్‌తోపాటు సమంత, నిత్యమీనన్, కాజల్ అగర్వాల్ నటించిన మెర్సల్ చిత్రం వివాదాలను లెక్క చేయకుండా కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికే 150 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

    అదిరిందికి తప్పని చిక్కులు

    అదిరిందికి తప్పని చిక్కులు

    అనేక వివాదాల మధ్య అదిరింది (మెర్సల్ తెలుగు) చిత్రం అక్టోబర్ 27న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. అయితే ఈ చిత్రంలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రాంతీయ సెన్సార్ బోర్డు అదిరిందిని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.

    English summary
    Ever since its release, Thalapathy Vijay‘s Mersal has been mired in controversies. As per the latest update, a petition has been filed at the Madras High Court to repeal the film certificate. Advocate A Aswathaman filed the petition in court. He stated that the film has shown the government in poor light. “The film was full of wrong propaganda about India and fake dialogues and scenes which obviously leads to a misconception about the new taxation system of India and the Goods and Service Tax Act, 2017 to the viewers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X