‘పెట్టా’ టీజర్: స్టైల్‌లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించిన రజనీ!
Recommended Video

రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'పెట్టా' టీజర్ విడుదలైంది. సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ టీజర్ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్‌లా నిలిచింది. ఇందులో ముఖ్యంగా రజనీ స్టైలిష్ అప్పియరెన్స్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
స్టైల్‌లో తనకు సాటి ఎవరూ రారు అని సూపర్ స్టార్ మరోసారి నిరూపించాడు. ఆయన వాకింగ్ స్టైల్, ముఖంలో కనిపించే కాన్ఫిడెన్స్ లెవల్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా తోడవ్వటంతో టీజర్ అదిరిపోయింది.

అవేమీ లేకుండానే టీజర్
అయితే టీజర్లో ఎలాంటి డైలాగులు లేక పోవడం, సినిమా కాన్సెప్ట్ ఏమిటి? అనే విషయాలపై ఎలాంటి హింట్ ఇవ్వక పోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ట్రైలర్ వస్తే తప్ప సినిమాపై ఓ అభిప్రాయానికి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

సంక్రాంతి బరిలో...
తమిళ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదలకు సిద్ధమైంది. న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కీలక పాత్రల్లో
ఈ చిత్రంలో రజనీకాంత్‌కు జోడీగా త్రిష నటిస్తుండగా విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ, సిమ్రన్, శశి కుమార్, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రజనీ అభిమానులకు విందు భోజనంలా ఈ చిత్రం ఉండబోతోందట.
రజనీ 68వ పుట్టినరోజు
కాగా.. నేడు రజనీకాంత్ 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్టవ్యాప్తంగా అభిమానుల సంబరాలు మిన్నంటాయి. గత రెండేళ్లుగా కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల రజనీకాంత్ పుట్టినరోజుకు దూరంగా ఉండటంతో పాటు అభిమానులకు సైతం సంబరాలు వద్దని సూచించారు. అయితే ఇప్పుడు అంతా సవ్యంగా ఉండటంతో తమిళనాడులో సెలబ్రేషన్స్ ఓ రేంజిలో జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











