twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటోలు: జపనీస్ అభిమానిని కలుసుకున్న రజనీకాంత్

    By Bojja Kumar
    |

    చెన్నై: హీరో రజనీకాంత్‌కు ఇండియాతో పాటు జపాన్‌లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. 90వ దశకంలో రజనీకాంత్ సినిమాలు భారీ ఎత్తున జపనీస్ బాషలోకి అనువాదం అయి రిలీజ్ అయ్యేవి. అక్కడ ఆయన సినిమాలకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చేవి.

    రజనీకాంత్ నటించిన 'ముత్తు' చిత్రం జపాన్‌లో 'డాన్సింగ్ మహారాజా' పేరుతో విడుదలై రికార్డ్ స్థాయి హిట్ అయింది కూడా. ఈ సినిమాతోనే జపాన్‌లో రజనీకాంత్ బాగా పాపులర్ అయ్యారు. 2010లో వచ్చిన రజనీకాంత్ 'రోబో'చిత్రం కూడా జపాన్‌లో మంచి ఆదరణ చూరగొంది.

    ఇలా రజనీకాంత్‌కు తమిళనాడు తో పాటు జపాన్ కూడా స్పెషల్ ప్లేసుగా మారి పోయింది. ఆయన అభిమానులు ఎక్కడుంటే ఆ ప్రాంతంపై రజనీ ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఆ మధ్య 2011లో జపాన్‌లో సునామీ వస్తే రజనీకాంత్ అక్కడి ప్రాంతాలను సందర్శించి, సునామీ బాధితులకు తన వంతు సహాయం చేసారు.

    అభిమానులు తనను చూడటానికి వస్తే రజనీకాంత్ అందుబాటులో ఉంటే తప్పకుండా కలుస్తారు. ఈ క్రమంలో ఇటీవల ఓ జపనీస్ అభిమాని రజనీకాంత్‌ను చూడటానికి జపాన్ నుంచి నేరుగా చెన్నైకి వచ్చింది. ఆ అభిమానిని తన ఇంట్లోకి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు సూపర్ స్టార్.

    ఫోటోలు: జపనీస్ అభిమానిని కలుసుకున్న రజనీకాంత్

    జపాన్‌కు చెందిన మహిళా అభిమాని Kiyoka రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. జపాన్ నుంచి ఓ అభిమాని తనను కలవడానికి రావడంపై రజనీకాంత్ ఎంతో థ్రిల్ అయ్యారు.

    ఫోటోలు: జపనీస్ అభిమానిని కలుసుకున్న రజనీకాంత్

    రజనీకాంత్ కొంత సేపు ఆమెతో గడపడంతో పాటు త్వరలోనే జపాన్ వస్తానని ప్రామిస్ చేసారు.

    ఫోటోలు: జపనీస్ అభిమానిని కలుసుకున్న రజనీకాంత్

    ఇతర అభిమానులు కూడా రజనీకాంత్ ను కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేసారు.

    ఫోటోలు: జపనీస్ అభిమానిని కలుసుకున్న రజనీకాంత్

    రజనీకాంత్ తన తర్వాతి సినిమా ‘కొచ్చాడయాన్' ఆడియో లాంచ్ కోసం జపాన్ వెళ్ల బోతున్నారు.

    ఫోటోలు: జపనీస్ అభిమానిని కలుసుకున్న రజనీకాంత్

    రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న ‘కొచ్చాడయాన్' చిత్రం జపనీస్ బాషలోకి అనువదించబోతున్నారు. ఇందులో రజనీకాంత్ తన పాత్రకు తానే జపనీస్ బాషలో డబ్బింగ్ చెప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Rajinikanth's connection with Japan is well-known and it goes without saying that he has a good fan following in the Land of The Rising Sun. The superstar's movies since 90s have been dubbed into Japanese and it has been getting good response for his films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X