»   » ఫ్యాన్స్‌‌కి బురిడీ: హన్సిక, శింబు ఇలా (ఫోటో)

ఫ్యాన్స్‌‌కి బురిడీ: హన్సిక, శింబు ఇలా (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: గత సంవత్సరం తాము ప్రేమలో ఉన్నామంటూ తమిళ హీరో శింబు, హీరోయిన్ హన్సిక ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏమైందో తెలియదు కానీ కొంత కాలం తర్వాత ఇద్దరూ విడిపోతున్నట్లు సీన్ క్రియేట్ చేసారు. శింబు మళ్లీ తన మాజీ ప్రియురాలు నయనతారకు దగ్గర కావడం వల్లనే హన్సిక దూరమయిందనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి.

శింబు గురించిన అన్ని విషయాలు త్వరలో బయట పెడతానంటూ ఇటీవల హన్సిక వ్యాఖ్యానించడంతో..... త్వరలో హన్సిక శింబు గురించి ఏదో బాంబు పేల్చబోదని ఆసక్తిగా గమనిస్తున్నారు అభిమానులు, మీడియా. అయితే తాజాగా తేలిన విషయం ఏమిటంటే వీరిద్దరూ కావాలనే గేమ్స్ ఆడుతూ....ఇటు మీడియాను, అటు అభిమానులను బురిడీ కొట్టిస్తున్నారని స్పష్టమవుతోంది.

ఈ రోజు (ఫిబ్రవరి 3) శింబు పుట్టినరోజ. షూటింగులో శింబు బిజీబిజీగా గడుపుతుండగా......ఆయన స్నేహితులు, యూనిట్ సభ్యులు అదివారం అర్ధరాత్రి 12 గంటలకు ఆయనతో కేక్ కట్ చేయించే ఏర్పాటు చేసారు. ఈ కేక్ కటింగ్ ప్రారంభానికి హీరోయిన్ హన్సిక కూడా హాజరై అందరినీ ఆశ్చర్య పరించింది.

మరో వైపు తన పుట్టినరోజును పురస్కరించుకుని శింబు తన రాబోయే తమిళ సినిమా Vaalu లోని 'యూ ఆర్ మై డార్లింగ్' అనే సాంగును విడుదల చేసాను. ఈ పాటను తన స్వీట్ హార్ట్ హన్సికకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలతో ఇద్దరూ విడిపోలేదని, ప్రేమలోనే ఉన్నారని స్పష్టమవుతోంది.

English summary

 There have been reports that Silambarasan and Hansika Motwani, who revealed that they were in love last year, had parted ways. But here is a confirmation that they are still together.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu