మలేషియా వెళ్లిన రజినీకాంత్ (ఫొటో & వీడియో)
చెన్నై: సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'కబాలీ'. ఈ చిత్ర షూటింగ్ నిమిత్తం రజినీ సోమవారం మలేషియా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె సౌందర్య తండ్రితో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కబాలీ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
రజనీకి ఘన స్వాగతం
'కబాలి' చిత్రం షూటింగ్ కోసం సోమవారం మలేషియా వెళ్లిన నటుడు రజనీకాంత్‌కు అక్కడి అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ మేరకు ఆయన అభిమానులు నగరంలో వివరాలను వెల్లడించారు.
మలేషియా చేరుకున్న ఆయనకు భారీ స్థాయిలో స్వాగతం లభించినట్లు తెలిపారు. అనంతరం సిద్ధంగా ఉన్న అధునాతన కారులో ఆయన అతిథి గృహానికి చేరుకున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











