మలేషియాలో రజనీకాంత్ ఇలా... (ఫొటోలు)
చెన్నై: 'కబాలి' చిత్రం షూటింగ్ కోసం సోమవారం మలేషియా వెళ్లిన నటుడు రజనీకాంత్‌కు అక్కడి అభిమానులు ఘనస్వాగతం పలికిన సంగతి తెలిసిందే. రజనీకు మలేషియా,జపాన్ లలో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. వారిలో మలేషియా గవర్నర్ మహ్మద్ ఖలీల్ యూకూబ్ ఒకరు. ముత్తు చూసిన తర్వాత ఆయన రజనీకాంత్ కు వీరాభిమానిగా మారిపోయారట.
కబాలి చిత్రీకరణ కోసం మలేషియా చేరిన రజనీకాంత్ ..మలాకా గవర్నర్ ని కలుసుకున్నారు. అంతేకాకుండా మలేషియా ప్రభుత్వం తరుపున పెద్ద అవార్డ్ డ్ టౌక్ షిప్ తో సన్మానించబోతున్నారట. తాను రజనీకాంత్ చిత్రాలకు పెద్ద అభిమానని అని, రజనీకాంత్ గ్రేట్ మ్యాన్ అని మాలాకా గవర్నర్ సూపర్ స్టార్ ని పొడగ్తలతో ముంచెత్తారు.
ఈ మేరకు ఆయన అభిమానులు నగరంలో వివరాలను వెల్లడించారు. మలేషియా చేరుకున్న ఆయనకు భారీ స్థాయిలో స్వాగతం లభించినట్లు తెలిపారు. అనంతరం సిద్ధంగా ఉన్న అధునాతన కారులో ఆయన అతిథి గృహానికి చేరుకున్నట్లు వెల్లడించారు.
స్లైడ్ షోలో .... ఆ ఫొటోలు..చిత్రం విశేషాలు చూడండి.

అభిమానులు..
ఆ తర్వాత ఆయన్ను అక్కడ అబిమానులు వచ్చి కలిసారు.

ఫొటోలు,మాటలు
వచ్చిన అభిమానులను ఆయన అప్యాయంగా రిసీవ్ చేసుకుని ఆయన వారితో ఫొటోలు దిగారు.

అఫీషియల్స్ సైతం...
అక్కడ అఫీషియల్ సైతం ఆయన రాకను ఎంతగానో ఆనందించి స్వాగతించారు. ఆ ఫొటోలను అఫీషియల్ గా మీడియాకు రిలీజ్ చేసారు.

అభిమానం కళ్ళలో...
రజనీపై అక్కడి వారికి ఉన్న అభిమానం మనం ఈ ఫొటోలలో చూడవచ్చు.

మలేషియా షెడ్యూలు తగ్గింపు
అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదట అనుకున్నట్లుగా కాకుండా మలేషియా షెడ్యూల్ డేస్ ని తగ్గించారు.

అవే తరహా
మలేషియాని పోలిన సెట్స్ ని చెన్నైలోనే వేస్తున్నారు.

డాన్ కాదు పోలీస్
ఈ చిత్రంలో రజనీకాంత్ డాన్ గా కనపడతారని వార్తలు వచ్చాయి. అయితే అదేం కాదు పోలీస్ పాత్ర అంటున్నారు.

కిషోర్ వచ్చాడు
ఈ టీమ్ లోకి కిషోర్ వచ్చి జాయిన్ అయ్యారు. చిత్రంలో నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది.

చెన్నై...
ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమైంది. సాలిగ్రామం..మోహన్ స్టూడియోస్ లో పెద్ద సెట్ వేసారు.

వినాయక చవితికే
ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఓపినింగ్ రోజు అంటే సెప్టెంబర్ 17న వినాయిక చవితి సందర్భంగా విడుదల చేసారు.

ద్విపాత్రలు
ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. కాఖీ డ్రస్, సూట్ రెండింటితో ఫొటో షూట్ జరగటంతో ఈ డౌట్ వస్తోంది.

నెక్ట్స్ షెడ్యూల్ ఇధి...
20 రోజుల పాటు చెన్నైలో చిత్రీకరణ జరుపుకొన్న తరువాత షూటింగ్ కోసం మలేషియా వచ్చారు.

నిరాడంబరంగా
రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'కబాలి'. రంజిత్ దర్శకుడు. వి.క్రియేషన్స్ బ్యానర్‌లో థాణు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆమధ్యన చెన్నైలో నిరాడంబంరంగా ఆరంభమైంది.

స్పెషల్ గా...
ప్రత్యేకంగా వేసిన సెట్‌లో రజనీకాంత్ రెగ్యుల ర్ షూటింగ్ జరిపారు.

విడుదల
ఈ చిత్రం రిలీజ్ ని తమిళ న్యూ ఇయర్ అయిన ఏప్రియల్ 14న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు రజనీకాంత్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓవర్ సీస్ రైట్స్
ఈ నేపధ్యంలో ఈ చిత్రం తమిళ, తెలుగు డిస్ట్రిబ్యూషన్ ఓవర్ సీస్ రైట్స్ ని సినీ గెలాక్సీ వారు సొంతం చేసుకున్నారు. వారు ఓవర్ సీస్ లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ లు అతి పెద్ద డిస్ట్రిబ్యూటర్స్.

సినీ గెలాక్సీ అధినేతలు మీడియాతో మాట్లాడుతూ...
"మేము ఈ ప్రాజెక్టులో భాగస్వాములం అవటం చాలా ఆనందంగా ఉంది, మనం, పవర్, భలే భలే మొగాడివోయ్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల తర్వాత మేము చేస్తున్న చిత్రం ఇది ," అన్నారు.

రియలిస్టిక్..
కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు.

మలేషియాలో...
అక్కడ కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ నడుస్తోందని చెప్తున్నారు. వారంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారని అంటున్నారు.

మెసేజ్ కూడా...
సినిమాలో స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ ఉండబోతోందని వినికిడి.

డ్రగ్ ఎడిక్ట్ గా...
ఆరవాన్ లో నటించిన దన్సిక ఈ చిత్రంలో డ్రగ్ ఎడిక్ట్ గా కనపడనుందని సమాచారం. ఆమె రజనీకుమార్తె. దన్సిక మాట్లాడుతూ... దన్సిక మాట్లాడుతూ తను కబాలి చిత్రంలో చేస్తున్నానని, రజనీ తో చేయటం చాలా ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు.

నో ఇమేజ్...
తన ఇమేజ్ ని పట్టించుకోకుండా కథలో ఏమైతే మార్పులో చెయ్యవచ్చో అవన్నీ చేయమని రజనీ..దర్శకుడుకి సూచించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











