»   »  చిత్రాలు : డబ్బు వ్యవహారంలో అమీర్‌‌తో ప్రియమణికి గొడవ!

చిత్రాలు : డబ్బు వ్యవహారంలో అమీర్‌‌తో ప్రియమణికి గొడవ!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నయ్ : హీరోయిన్ ప్రియమణికి 'పరుత్తివీరన్‌' అనే తమిళ చిత్రంలో నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. తనకు దక్కిన విజయం దర్శకునికే చెందుతుందని, ఆయన కోరుకున్న విధంగా నేను నటించాను, అవార్డు రావడానికి కారణమై దర్శకుడు అమిర్‌కు జన్మజన్మల వరకు రుణపడి ఉంటానని అపట్టో ప్రియమణి చెప్పుకొచ్చింది.

  ఇటీవల ఓ నిర్మాత తన చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్ కి సంబంధించి హీరోయిన్ ప్రియమణి అతిథిగా హాజరవ్వాలని కోరాడు. అయితే ఆమె ఆ ఫంక్షన్ కి హాజరు కావడానికి నో చెప్పింది.

  ఆ చిత్ర ఆడియో వేడుకకు హాజరయ్యే అతిథుల్లో అమీర్ సుల్తాన్ పేరు ఉండటం వల్లనే ఆమె అక్కడి వెళ్లడానికి నో చెప్పిందని టాక్.

  ఈ ఇద్దరి మధ్య విబేధాలు మరింత ముదిరాయి అనడానికి....ఈ సంఘటనే కారణమని తమిళ సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

  అయితే ఇలా చేయడం ప్రియమణి కెరీర్ కి అంత మంచిది కాదని ఇండస్ట్రీ పరిశీలకుల అభిప్రాయం. విబేధాలు పక్కనపెట్టి అందరితో కలిస్తేనే అవకాశాలు వస్తాయని అంటున్నారు.

  ప్రియమణి చేస్తున్న సినిమాల విషయానికొస్తే...ఆమె ప్రస్తుతం మళయాలం, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. మళయాలంలో పెర్ఫ్యూమ్, ఎస్ ఐయామ్, తెలుగులో అంగుళీక చిత్రాల్లో నటిస్తోంది.

  కానీ ఇప్పుడు ఆ దర్శకుడంటే ప్రియమణికి అస్సలు పడటం లేదు. ఈ ఇద్దరి మధ్య డబ్బు వ్యవహారంలో గొడవలు వచ్చాయని, అప్పటి నుంచి ఇద్దరికీ అస్సలు పడటం లేదని తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. ఆ మధ్య ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. పైగా విబేధాలు మరింత ముదిరాయి. మిగతా స్టోరీ ఫోటోల్లో చూద్దాం...

  English summary
  Priyamani shot to fame with her National Award winning performance in Tamil film Paruthiveeran directed by Ameer Sultan. The actress had credited the success to the director for bringing out the best from her. However, their good relationship did not last long, as they parted ways over some serious differences.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more