తమిళతెరపైకి మరో రెండు తెలుగు చిత్రాలు
తాత ఆస్తి దక్కించుకోవాలంటే డిగ్రీ పూర్తి చేయాలనే కారణంగా అక్రమ మార్గంలో పాసయ్యేందుకు ప్రయత్నిస్తాడు హీరో. ఆపై డబ్బు ముఖ్యం కాదు.. మానవ సంబంధాలు ప్రధానమనే విషయాన్ని తెలుసుకోవడాన్ని అందంగా చూపారీ చిత్రంలో. జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బిందుమాధవి, హరిప్రియ తమ అందాలతో అలరిస్తే.. అవసరాల శ్రీనివాస్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని 'జమీన్' పేరుతో తమిళంలో విడుదల చేస్తున్నారు.
ఇక రవితేజ నటించిన 'నిప్పు' కూడా తమిళంలో 'రౌడీరాజా' పేరుతో త్వరలోనే విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం రవితేజ బాణీలో సాగింది. శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపిస్తాడు. రవితేజకు జంటగా దీక్షాసేథ్ ఆడిపాడింది. సంగీతం తమన్. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం... త్వరలోనే విడుదల కానుంది.


Click it and Unblock the Notifications












